News


9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు

Tuesday 15th October 2019
news_main1571113746.png-28887

  • రుణ మేళాలో బ్యాంకుల జోరు...
  • డిపాజిట్లకు బీమా పెంపు పరిశీలన
  • కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటన

న్యూఢిల్లీ: పండుగుల సీజన్‌లో మార్కెట్లో రుణ వితరణ పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు తొమ్మిది రోజుల్లో బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో రూ.81,781 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తెలిపారు. ఇందులో నూతనంగా జారీ చేసిన రుణాలు రూ.34,342 కోట్లు అని చెప్పారు. బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) పెద్ద కార్పొరేట్‌ సంస్థల నుంచి చేయాల్సిన చెల్లింపులు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి బిల్‌ డిస్కౌంటింగ్‌ సదుపాయం అందించాల్సిందిగా బ్యాంకులను కోరినట్టు తెలిపారు. సుమారు రూ.40,000 కోట్లు పెద్ద కార్పొరేట్‌ సంస్థల నుంచి ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపులు జరగాల్సి ఉన్నట్టు చెప్పారు. 
పీఎంసీ పరిణామాలపై సునిశిత పర్యవేక్షణ
పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పర్యవేక్షిస్తున్నామని, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ హామీ ఇచ్చినట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వీలైనంత తొందరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. బ్యాంకుల్లో గరిష్టంగా రూ.లక్ష డిపాజిట్‌ వరకే డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ద్వారా బీమా ఉండగా, ఈ పరిమితి పెంపును ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. దీన్ని పార్లెమెంటు ద్వారా చేపడతామన్నారు. 
ఒప్పందాలను గౌరవిస్తాం..
ఇంధన రంగంలో, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఒప్పందాలను భారత్‌ గౌరవిస్తుందని మంత్రి సీతారామన్‌ తెలిపారు. ఈ విషయంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందొద్దని కోరారు. 



You may be interested

శ్రీసిటీలో ఐఎంఓపీ ప్లాంట్‌ విస్తరణ

Tuesday 15th October 2019

కేవీబీపురం : శ్రీసిటీలోని జపాన్‌కు చెందిన ఇండియా మెటల్‌ వన్‌ స్టీల్‌ ప్లేట్‌ ప్రోసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఎంఓపీ) పరిశ్రమ ఉత్పత్తి కేంద్రం విస్తరణ సోమవారం జరిగింది. ఐఎంఓపీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తకేషి హిరాయ్‌ నూతన ఉత్పత్తి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2012లో శ్రీసిటీలో ఏర్పాటైన ఐఎంఓపీ పరిశ్రమ కస్టమర్లకు వినూత్న పరిష్కారాలను అందిస్తోందని తకేషి హిరాయ్‌ అన్నారు. ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నూతనంగా ఫ్లాంటును విస్తరింపజేశామన్నారు. రూ.200కోట్ల పెట్టుబడులతో

పీఎంసీ బ్యాంకులో రూ.40,000కు ఉపసంహరణ పరిమితి

Tuesday 15th October 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) ఖాతాదారులు, డిపాజిట్‌ దారులకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట ఉపసంహరణ పరిమితి ప్రస్తుతం రూ.25,000 ఉండగా, దీన్ని రూ.40,000కు ఆర్‌బీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రుణాల విషయంలో బ్యాంకు యాజమాన్యం అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో పీఎంసీ బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలను అమలు చేస్తున్నట్టు ఆర్‌బీఐ గత నెల 23న ప్రకటించిన విషయం

Most from this category