News


ఎస్‌బీఐ వడ్డీ రేట్ల కోత

Friday 7th February 2020
news_main1581055067.png-31592

రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు
తాజా రేట్లు ఈ నెల 10 నుంచీ అమలు
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల ప్రభావం

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) తాజాగా వడ్డీ రేట్లలో కోత పెట్టింది. సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 10(సోమవారం) నుంచీ అమలు చేయనున్నుట్లు ఎస్‌బీఐ పేర్కొంది. తాజా సవరణలో భాగంగా రుణాలకు వర్తించే మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్‌డ్‌ లెండింగ్‌ రేట్ల(ఎంసీఎల్‌ఆర్‌)ను 5 బేసిస్‌ పాయింట్లమేర తగ్గించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్‌ 7.90 శాతం నుంచి 7.85 శాతానికి దిగివచ్చింది. తద్వారా గృహ, ఆటో తదితర రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు ఏర్పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ఎంసీఎల్‌ఆర్‌లో ఇప్పటివరకూ 9సార్లు కోతలను అమలు చేసినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.  కాగా.. మరోపక్క వివిధ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లలో 10-50 బేసిస్‌ పాయింట్ల(0.1-0.5 శాతం)మేర ఎస్‌బీఐ కోతను విధించింది. దీంతో కాలపరిమితిగల రిటైల్‌(పిక్స్‌డ్‌) డిపాజిట్లపై లభించే వడ్డీ రేటులో 0.1-0.5 శాతంమేర తగ్గనుంది. ఇదే విధంగా బల్క్‌ టెర్మ్‌ డిపాజిట్లపైనా 25-50 బేసిప్‌ పాయింట్ల వడ్డీ కోతలను అమలు చేయనున్నట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. 
 

ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్‌?
వ్యవస్థలో లిక్విడిటీ మిగులు పరిస్థితుల కారణంగా వడ్డీ రేట్లలో తాజా సవరణలు చేపట్టినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు నిర్వహించిన పరపతి సమీక్షలో ఎంపీసీ గురువారం యథాతథ రేట్ల కొనసాగింపునకే నిర్ణయించింది. అయితే వ్యవస్థలో లిక్విడిటీ పెంపునకు కొన్ని చర్యలు ప్రకటించింది. దీంతో ఎస్‌బీఐ బాటలో ఇకపై పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్‌బీఐ నిర్ణయాల ప్రభావం తదుపరి ఎంసీఎల్‌ఆర్‌ సమీక్షలో ప్రతిఫలించనున్నట్లు ఈ సందర్భంగా ఎస్‌బీఐ తెలియజేసింది.



You may be interested

అధిక వాల్యూషన్‌ ఉన్న షేర్లే బెటర్‌!

Friday 7th February 2020

శంకర్‌ శర్మ సంచలన సూచన సాధారణంగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సమయంలో అందరూ అల్ప పీఈ(ప్రైస్‌ టు ఎర్నింగ్‌) నిష్పత్తి ఉన్న షేర్ల వైపు మొగ్గు చూపుతుంటారు. పీఈ తక్కువగా ఉన్న షేర‍్ల వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు అనలిస్టులు లెక్కిస్తారు. కానీ సీనియర్‌ అనలిస్టు శంకర్‌ శర్మ తాజాగా కొత్త సూచన చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో అధిక పీఈ ఉన్న స్టాకులను కొనడం, అల్ప పీఈ ఉన్న స్టాకులను షార్ట్‌ చేయడం

ఈ మిడ్‌ క్యాప్స్‌ మీ దగ్గరున్నాయా?!

Friday 7th February 2020

బ్రోకింగ్‌ సంస్థల సిఫారసులు బయ్‌, హోల్డ్‌, సెల్‌ రేటింగ్స్‌ జాబితాలో సౌత్‌ బ్యాంక్‌, బేయర్‌ క్రాప్‌ థెర్మాక్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, కేడిలా.. వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలోసాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బ్రేకవుట్‌ కావచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు విభిన్న రంగాలకు చెందిన కొన్ని మిడ్‌ క్యాప్‌

Most from this category