STOCKS

News


ఆ స్టార్టప్స్‌కు మరో అవకాశం ఉండదు:రతన్‌ టాటా

Wednesday 29th January 2020
news_main1580277586.png-31299

ముంబై: ఇన్వెస్టర్ల డబ్బులను వృధాచేసి, మాయమైన స్టార్టప్స్‌కు మరో అవకాశం ఉండదని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘కొన్ని స్టార్టప్స్‌ ఇట్టే ఆకట్టుకుంటాయి. డబ్బులు వసూలు చేస్తాయి. ఆ తర్వాత కనుమరుగవుతాయి. అటువంటి స్టార్టప్స్‌కు రెండు, మూడవ అవకాశం ఉండదు’ అని అన్నారు. టైకాన్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి చేతుల మీదుగా స్వీకరించిన సందర్భంగా మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీలు నైతికంగా వ్యవహరించాలని, రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసేలా ఉండకూడదని హితవు పలికారు. స్టార్టప్స్‌కు గురువులు ఉండాలని, సలహాలు, పరిచయాలు అవసరమని అన్నారు. గుర్తింపూ అవసరమేనని చెప్పారు. పాతతరం వ్యాపారాలు వెనక్కిపోతాయని, వినూత్న కంపెనీల యువ వ్యాపారవేత్తలు భవిష్యత్‌ లీడర్లు అని కితాబిచ్చారు. కాగా, రతన్‌ టాటా ఇప్పటికే పలు స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టారు. 



You may be interested

తప్పు చేయకుంటే.. భయమక్కర్లేదు

Wednesday 29th January 2020

బ్యాంకర్లకు కేంద్రం భరోసా న్యూఢిల్లీ: మొండిబకాయిల (ఎన్‌పీఏ) తీవ్రత, మోసాలు పెరగడం వంటి పరిస్థితుల్లో  ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అని భయాందోళనలకు గురవుతున్న బ్యాంకర్లకు భరోసా లభించింది. తీసుకున్న నిర్ణయం విషయంలో వైఫల్యం ఉన్నా... అందులో దురుద్ధేశాలు లేనట్లయితే బ్యాంకర్లు భయపడాల్సిన పనిలేదని సంకేతాలిస్తూ, కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. బ్యాంక్‌ అధికారులు కొందరు పాల్పడే భారీ మోసాలపై తీసుకునే చర్యల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎండీ, సీఈఓలను

కరోనా ఎఫెక్ట్‌- కెమికల్‌ కంపెనీలకు బెనిఫిట్‌?!

Wednesday 29th January 2020

ఏడాది గరిష్టాలకు స్పెషాలిటీ కెమికల్‌ షేర్లు 6 శాతం జంప్‌చేసిన ఫైన్‌ ఆర్గానిక్‌ 3 శాతం లాభపడిన నవీన్‌ ఫ్లోరిన్‌ కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న చైనీస్‌ కరోనా వైరస్‌ దేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చనుందా.. అంటే అవుననే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. చైనీస్ హుబే ప్రొవిన్స్‌లో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలకు ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొంతకాలంగా పటిష్ట పనితీరును

Most from this category