News


స్టార్టప్‌లకు ‘జెమ్‌’ ద్వారా రూ.275 కోట్ల ఆర్డర్లు

Wednesday 5th June 2019
news_main1559730438.png-26114

ప్రభుత్వ ఈ మార్కెట్‌ ప్లేస్‌లో 1,862 ‍స్టార్టప్‌లకు చోటు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నమెంట్‌ ఈ మార్కెట్‌ ప్లేస్‌లో (జెమ్‌) 1,862 స్టార్టప్‌లు నమోదయ్యయాని, ఈ వేదిక ద్వారా అవి ఇప్పటి వరకూ రూ.275 కోట్ల విలువైన 7,697 ఆర్డర్లను సాధించాయని డీపీఐఐటీ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు తమకు కావాల్సిన సరుకులు, సేవలను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసుకునేందుకు గాను జెమ్‌ను 2016 ఆగస్ట్‌లో కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ వేదిక ద్వారా కొనుగోళ్ల వ్యయాలను తగ్గించాలన్నది ఆశయం. ప్రభుత్వం గుర్తించిన 16,105 స్టార్టప్‌లు ఇప్పటి వరకు 1,87,004 ఉద్యోగాలను కల్పించినట్టు అభిషేక్‌ తెలిపారు. ప్రతీ ప్రత్యక్ష ఉద్యోగం పరోక్షంగా మరో ముగ్గురికి ఉపాధికి దారితీస్తుందని, తద్వారా స్టార్టప్‌ల రూపంలో 5.6 లక్షల మందికిపైగా ఉపాధి లభించినట్టు ఆయన పేర్కొన్నారు. రూ.25,000 కోట్ల పెట్టుబడులను రాబట్టేందుకు 45 వెంచర్‌ ఫండ్స్‌కు రూ.2,570 కోట్ల నిధుల సాయాన్ని సిడ్బీ అందిస్తుందన్నారు. 244 స్టార్టప్‌లకు ఇప్పటికే రూ.1,561 కోట్ల నిధుల సాయం లభించినట్టు చెప్పారు. 



You may be interested

ఇంధనాల రిటైలింగ్‌లో పోటీకి ఊతం

Wednesday 5th June 2019

పెట్రోల్ బంకు లైసెన్సు  నిబంధనల సడలింపు మంచిదే పీఎస్‌యూల గుత్తాధిపత్యం తగ్గుతుంది ఇక్రా నివేదిక న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల ఏర్పాటు లైసెన్సుకు సంబంధించిన నిబంధనలను సడలించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు చేస్తే ఇంధనాల రిటైలింగ్ రంగంలో పోటీకి తోడ్పాటు లభిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (ఓఎంసీ) గుత్తాధిపత్యానికి గండిపడుతుందని, అవి కూడా పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడగలదని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్

డెల్‌, జీప్‌, ఎల్‌ఐసీ అత్యంత విశ్వసనీయ బ్రాండ్లు

Wednesday 5th June 2019

న్యూఢిల్లీ: భారతీయ అత్యంత విశ్వసనీయ బ్రాండ్ల జాబితాలో ప్రముఖ ల్యాప్‌టాప్‌ బ్రాండ్‌ ‘డెల్‌’ తొలిస్థానంలో ఉన్నట్లు టీఆర్‌ఏ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ ‘బ్రాండ్‌ ట్రస్ట్‌ రిపోర్ట్‌ 2019’ పేరిట విడుదలచేసిన తాజా నివేదికలో ఆటోమొబైల్ కంపెనీ జీప్ అత్యంత విశ్వసనీయ బ్రాండ్ల జాబితాలో రెండవ స్థానంలో ఉండగా.. ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నాల్గవ స్థానంలో

Most from this category