News


స్పైస్‌జెట్‌ నష్టాలు రూ.463 కోట్లు

Thursday 14th November 2019
news_main1573702900.png-29570

  • ప్రభావం చూపిన మ్యాక్స్‌ విమానాల వ్యయాలు 
  • రూ.2,845 కోట్లకు పెరిగిన నిర్వహణ ఆదాయం

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సం‍స్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో రూ.463 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల సర్వీసులు నిలిపివేయడం వల్ల వ్యయాలు పెరిగాయని, అంతే కాకుండా సాధారణంగా సెప్టెంబర్‌ క్వార్టర్‌ బలహీనంగా ఉంటుందని, అకౌంటింగ్‌ నిబంధనల్లో మార్పుల వల్ల రూ.180 కోట్ల నష్టాలొచ్చాయని.... ఈ మూడు అంశాల కారణంగా ఈ క్యూ2లో ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని స్పైస్‌జెట్‌ వివరించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే క్వార్టర్‌లో రూ.389 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. 
118 విమానాలతో సర్వీసులు...
గత క్యూ2లో రూ.1,875 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆదాయం ఈ క్యూ2లో రూ.2,845 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మొత్తం 118 విమానాలతో రోజుకు సగటున 630 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. 

వచ్చే ఏడాది బోయింగ్‌ సర్వీసులు...! 
బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల సర్వీసులను నిలిపేయడం వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేయాల్సిందిగా బోయింగ్‌ కంపెనీని కోరుతున్నామని, దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టామని స్పైస్‌జెట్‌ సీఎమ్‌డీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. మరింత కట్టుదిట్టమైన సురక్షిత ఫీచర్లతో కూడిన కొత్త బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను బోయింగ్‌ కంపెనీ త్వరలోనే సరఫరా చేయనున్నదని, వచ్చే ఏడాది ఆరంభంలో ఈ విమాన సర్వీసులను ఆరంభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 



You may be interested

వాట్సాప్‌ పే... ఇప్పట్లో రాదేమో?

Thursday 14th November 2019

- ఆర్థిక లావాదేవీల వివరాల భద్రతపై సందేహాలు - ప్లాట్‌ఫామ్‌ను ఆడిట్‌ చేయనున్న ప్రభుత్వం, ఆర్‌బీఐ - గణనీయంగా తగ్గిన వాట్సాప్‌ డౌన్‌లోడ్స్‌ న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఇతర ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థలకు దీటుగా పేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేట్లు కనిపించడం లేదు. యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచడంలో వాట్సాప్‌ సామర్ధ్యంపై నెలకొన్న సందేహాలే ఇందుకు కారణం. దీనికి తోడు..

కాఫీ డే లాభాలు క్యూ1లో రూ.1,567 కోట్లు

Thursday 14th November 2019

గత క్యూ1లో రూ.21 కోట్లు మాత్రమే కలసివచ్చిన ‘మైండ్‌ ట్రీ’ వాటా విక్రయం న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) జూన్‌ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌) రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,567 కోట్లకు పెరిగిందని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో వాటా విక్రయం కారణంగా వచ్చిన

Most from this category