స్పెన్సర్స్ గూటికి గోద్రెజ్ నేచుర్స్ బాస్కెట్
By Sakshi

న్యూఢిల్లీ: సంజీవ్ గోయంకా గ్రూపులో భాగమైన స్పెన్సర్స్ రిటైల్, గోద్రెజ్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ గ్రోసరీ సంస్థ నేచుర్స్ బాస్కెట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.300 కోట్లు. ఈ కొనుగోలు ద్వారా స్పెన్సర్స్ రిటైల్ దేశవ్యాప్త కార్యకలాపాలు కలిగిన సంస్థగా మారుతుంది. ముంబై, పుణె, బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల్లో 36 స్టోర్లతోపాటు పశ్చిమాదిన స్పెన్సర్స్‌కు నెట్వర్క్ లభిస్తుంది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ గోద్రేజ్ నేచుర్స్ బాస్కెట్లో నూరు శాతం వాటాను (44,58,30,000 షేర్లు) కొనుగోలు చేసే ప్రతిపాదనకు స్పెన్సర్స్ రిటైల్ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. వాటాదారులు, నియంత్రణ సంస్థల ఆమోదంపై ఇది ఆధారపడి ఉంటుందని స్పెన్సర్స్ రిటైల్ తెలిపింది. నేచుర్స్ బాస్కెట్ 2018-19 సంవత్సరంలో రూ.338 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఆహార, పానీయాలు, గ్రోసరీ వస్తువులను విక్రయిస్తుంటుంది.
You may be interested
వారాంతాన బలహీనపడిన రూపాయి
Saturday 18th May 2019శుక్రవారం 20 పైసలు డౌన్ డాలరుతో 70.23 వద్ద ముగింపు మూడు రోజుల లాభాల తరువాత మళ్లీ పతనం ముంబై: డాలరుతో రూపాయి మారకం విలువ మరోసారి కుదేలైంది. శుక్రవారం 20 పైసలు నష్టపోయి 70.23 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 70.22 వద్ద ప్రారంభమై ఒక దశలో 70.32 వద్దకు పతనమైంది. గురువారం నాటి ముగింపు 70.03తో పోల్చితే చివరకు 20 పైసలు బలహీనపడింది. వరుసగా మూడు రోజులపాటు బలపడుతూ వచ్చిన
పడి లేచే కెరటాలేనా... ఇవి?
Friday 17th May 2019టాటా మోటార్స్, యస్ బ్యాంకు, దిలీప్ బిల్డ్‌కాన్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇలా కొన్ని స్టాక్స్ ఇటీవలి కాలంలో బాగా నష్టాలను చవిచూశాయి. అమ్మకాల ఒత్తిడికి ఇవి పడిపోయాయి. ఈ స్టాక్స్‌లో ర్యాలీ ఆగిపోవడమే కాదు... సమీప కాలంలో ఇవి రికవరీ అవుతాయా? అన్న సందేహాలు కూడా ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ఇలా పడిపోయిన వాటిల్లో కొన్ని ఇప్పటికీ వ్యాల్యూ బై కాదని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. యస్ బ్యాంకు షేరు అయితే