News


ఫోర్బ్స్‌ ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌లో ‘మేఘా’కు ప్రత్యేక స్థానం!

Thursday 21st November 2019
Markets_main1574307672.png-29742

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఇండియా మేగజీన్‌..  ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌ 2019’లో మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) చైర్మన్‌ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్‌లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్‌ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్‌ విడుదల చేసిన 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మేఘా బిల్డర్‌’ పేరుతో ఫోర్బ్‌‍్స ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రచురించిన ఈ వ్యాసంలో,  1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన  మెఘా ఇంజనీరింగ్‌, అటు తర్వాత ఆ సంస్థ అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది. 14 బిలియన్‌ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు- కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. అలాగే జోర్డాన్‌, కువైట్‌, టాంజానియా, జాంబియా వంటి పలు దేశాల్లోని పలు ప్రాజెక్టుల్లో సంస్థ క్రియాశీలంగా వ్యహరిస్తున్న విషయాన్ని ఉటంకించింది. భారత్‌ అత్యుత్తమ ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక‌్షన్‌ కంపెనీల్లో ఒకటిగా ఎంఈఐఎల్‌ నిలుస్తోందని పేర్కొంది. రుణ రహిత కంపెనీగా ఎంఈఐఎల్‌ కొనసాగుతున్న విషయాన్ని పోర్‌‍్బ్స  ప్రత్యేకంగా ప్రస్తావించింది. 



You may be interested

‘దివాన్‌’... దివాలా!

Thursday 21st November 2019

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డు రద్దు అడ్మినిస్ట్రేటర్‌ నియామకం ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు మాజీ ఎండీ ఆర్‌ సుబ్రమణియకుమార్‌ను పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్‌) నియమించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలను (హెచ్‌ఎఫ్‌సీలు) దివాలా చర్యల కోసం ప్రతిపాదించే అధికారాన్ని ఆర్‌బీఐకి కట్టుబెడుతూ కేంద్ర సర్కారు గత వారంలో

ఏడాదిలోగా బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ విలీనం పూర్తి..!

Thursday 21st November 2019

కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్‌ వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ల విలీన ప్రక్రియ వచ్చే 18 నుంచి 24 నెలల్లోనే పూర్తికానుందని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. భారీ నష్టాలతో కుదేలవుతున్న ఈ సంస్థలను విలీనం చేసేందుకు అక్టోబర్‌ 23న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని వివరించారు. 2010 నుంచి

Most from this category