STOCKS

News


టీవీ నెట్‌వర్క్ 18 కొనుగోలుకు సోనీ ఆసక్తి..?

Thursday 21st November 2019
news_main1574333073.png-29761

ముఖేశ్‌ అంబానీ నియంత్రణలోని టెలివిజన్‌ వ్యాపారంలో వాటాను కొనుగోలు చేసేందుకు జపాన్‌ దిగ్గజం సోనీ కార్ప్ ఆస్తకి చూపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ముఖేశ్‌ నేతృత్వంలోని నెట్‌వర్క్ 18 మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సోని ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. దక్షిణాసియా దేశాల్లో రోజురోజూకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా సోని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం సోనీ కంపెనీ ఇండియాలోని తన సొంత వ్యాపారాన్ని నెట్‌వర్క్‌ 18 ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌తో విలీనం చేయడం, బిడ్‌ ప్రక్రియ ద్వారా వాటాను దక్కించుకోవడం లాంటి నిర్మాణాత్మక అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని వారు తెలిపారు. ఈ వార్తలతో నెట్‌వర్క్‌ 18 షేర్లు 19శాతం లాభపడగా, టీవీ18 షేర్లు దాదాపు 10శాతం పెరిగాయి. ఒకవేళ చర్చలు ఫలప్రదమై ఒప్పందం విజయవంతమైనట్లైతే... సోని స్థానిక సమర్పణలను మరింత పెంచడంతో పాటు తన ప్రత్యర్థి నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటినిస్తుంది. అంబానీ గ్రూప్‌నకు అంతర్జాతీయ కంటెంట్‌ను ఇస్తుంది. అయితే ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మీడియా వర్గాలు కోరగా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. టీవీ 18 బ్రాడ్‌కాస్ట్ దేశవ్యాప్తంగా 56 ఛానెళ్లను, 16 అంతర్జాతీయ ఛానెళ్ల  కలిగి ఉంది. సోనీ కంపెనీ మనదేశంలో సోని పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా పేరుతో సేవలు అందిస్తోంది. 
అర బిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో భారత్‌లో వీడియో స్ట్రీమింగ్ మార్కెట్‌కు మంచి డిమాండ్‌ నెలకొంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ సహా ఎన్నో కంపెనీలు యాప్‌లతో వీడియో స్ట్రీమింగ్‌ సేవలను అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టు అమెజాన్.కామ్ ఇంక్ వంటి స్ట్రీమింగ్ కంపెనీలు చందాదారులను ఆకర్షించడానికి స్థానికంగా సృష్టించిన ప్రోగ్రామ్‌లను ఎక్కువగా అందిస్తున్నాయి. అంబానీ  జియో, టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్స్‌ కలిగి ఉన్నప్పటికీ, కంటెంట్ కొరతతో ఇబ్బందులు పడుతోంది. ఈ తరుణంలో సోనీతో ఒప్పందం కీలకం కానుంది. You may be interested

బీపీసీఎల్‌ వాటా విక్రయంతో ఓఎంసీల రీరేటింగ్!

Thursday 21st November 2019

నిపుణుల అంచనా బీపీసీఎల్‌ ప్రైవేటేజేషన్‌తో మొత్తం ఓఎంసీ రంగం రీరేటింగ్‌ పొందే ఛాన్సుందని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జాని అభిప్రాయపడ్డారు. కంపెనీలో వాటాల విక్రయానికి ప్రభుత్వం అధికారిక అనుమతినిచ్చింది. దీంతో ఈ రంగంలోని కంపెనీల నిజవిలువ మరింతగా బయటకు రానుందని జాని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో మార్కెట్‌కు వాటాల విక్రయంపై నమ్మకం కుదిరిందన్నారు. బీపీసీఎల్‌లో వాటాలతో పాటు యాజమాన్య నిర్వహణను సైతం ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో కంపెనీ కోసం హేమాహేమీలు పోటీ

నష్టాల్లో మెటల్‌ షేర్లు..హిందుస్తాన్‌ కాపర్‌ 5% డౌన్‌

Thursday 21st November 2019

హాంగ్‌కాంగ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడంతో యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గురువారం సెషన్‌లో మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మధ్యాహ్నం 2.37 సమయానికి 1.24 శాతం నష్టపోయి 2,493.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హిందుస్థాన్‌  కాపర్‌ 5.18 శాతం, సెయిల్‌ 3.30 శాతం, కోల్‌ ఇండియా 2.19 శాతం, టాటా స్టీల్‌ 1.83 శాతం, జిందాల్‌ స్టీల్‌

Most from this category