పెరిగిన ‘సోనాలికా’ మార్కెట్ వాటా
By Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ ‘సొనాలికా’ మార్కెట్ వాటా ఈ ఏడాది ఆగస్టులో 0.8 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. గతనెల్లో 14.7 శాతానికి చేరుకుంది. దేశీ ఆటో రంగం మందగమనంలో నడుస్తున్నప్పటికీ.. తమ బ్రాండ్ మాత్రం వేగంగా దూసుకుపోతుందని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటీఎల్) ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఏప్రిల్-ఆగస్టు కాలంలో తమ ఎగుమతులు మొదటి స్థానానికి చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘ఆటో రంగం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు మా బ్రాండ్ ఫౌండేషన్ ఎంతటి బలంగా ఉందనే విషయాన్ని వ్యక్తపరిచింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులను తీసివేయకుండా.. మేం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, నూతన ఉత్పత్తుల విడుదల ఫలించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.
You may be interested
సెన్సెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు జంప్
Monday 23rd September 2019కార్పొరేట్ పన్ను తగ్గింపుతో గత శుక్రవారం అతిపెద్ద ర్యాలీ జరిపిన భారత్ స్టాక్ సూచీలు సోమవారం సైతం అదేజోరుతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ మొదలైన క్షణాల్లోనే బీఎస్ఈ సెన్సెక్స్ భారీగా 850 ర్యాలీ జరిపి 38,865 పాయింట్ల స్థాయిని అందుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇదేబాటలో 250 పాయింట్లు జంప్‌చేసి 11,525 పాయింట్ల స్థాయికి చేరింది.
ఇంధన రంగ సీఈవోలతో మోదీ
Monday 23rd September 2019హూస్టన్: అమెరికాకు చెందిన చమురు, సహజ వాయువు రంగ కంపెనీల సీఈవోలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై వారితో చర్చించారు. ఇంధన భద్రత, భారత్-యూఎస్ మధ్య పరస్పర పెట్టుబడి అవకాశాల పెంపుపై మాట్లాడారు. ‘ఎనర్జీ రంగంలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో సమావేశం అద్భుతంగా సాగింది. హూస్టన్‌కు వచ్చి ఇంధనం గురించి మాట్లాడకుండా ఉండడం