కొన్ని ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాలు
By Sakshi

సువెన్ లాభం 1,565 శాతం జంప్ యూనియన్ బ్యాంక్ నష్టాలు రూ.1,194 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.1,194 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.9,438 కోట్ల నుంచి రూ.10,557 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరింత పెరిగిన జీవీకే పవర్ నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో సువెన్ లైఫ్ సైన్సెస్ నికరలాభం అనూహ్యంగా పెరిగింది. లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1,565 శాతం అధికమై రూ.63.27 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.96 కోట్ల నుంచి రూ.280 కోట్లకు ఎగసింది.
తగ్గిన మొండి బకాయిలు....
బ్యాంక్ రుణ నాణ్యత అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో 15.74 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.24 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 8.42 శాతం నుంచి 6.98 శాతానికి చేరాయి. మొండి బకాయిలు తగ్గినా కేటాయింపులు మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. గత క్యూ2లో రూ.1,710 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,328 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు, ఇతరాలకు కలిపి మొత్తం మీద కేటాయింపులు రూ.1,716 కోట్ల నుంచి రూ.3,859 కోట్లకు పెరిగాయి.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు మరింత పెరిగాయి. ఈ కాలంలో నష్టం రూ.159 కోట్లకు ఎగసింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.110 కోట్ల నష్టాన్ని చవిచూసింది. టర్నోవరు రూ.1,060 కోట్ల నుంచి రూ.1,059 కోట్లకు స్వల్పంగా తగ్గింది.
You may be interested
నష్టాల్లో ఆరంభమైన ఐడియా, ఎయిర్టెల్ షేర్లు
Friday 15th November 2019గురువారం క్యు2 ఫలితాల్లో భారీ నష్టాలు నమోదు చేసిన టెలికం సంస్థలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్లో నష్టాల్లో ఓపెనయ్యాయి. ఎయిర్టెల్ సుమారు ఒక శాతం నష్టంతో ఆరంభమై వెంటనే లాభాల్లోకి మరలింది. ఉదయం 9.19 సమయానికి ఎయిర్టెల్ దాదాపు 1.13 శాతం లాభంతో 366 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరో దిగ్గజం వొడాఫోన్ ఐడియా మాత్రం ఆరంభం నుంచి తీవ్రనష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఆల్టైమ్
గ్యాప్అప్ ఓపెనింగ్
Friday 15th November 2019ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ఫలితంగా భారత్ స్టాక్ సూచీలు శుక్రవారం గ్యాప్అప్తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 40,435 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్ల గ్యాప్అప్తో 11,914 పాయింట్ల వద్ద మొదలయ్యాయి.