News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Friday 31st May 2019
news_main1559287233.png-26020

  • తగ్గిన ఎన్‌ఏసీఎల్‌ లాభం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆగ్రోకెమికల్‌ కంపెనీ ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ (నాగార్జున అగ్రికెమ్‌) లాభం 11 శాతం తగ్గింది. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ.11.18 కోట్లుగా ఉండగా.. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.8.35 కోట్లకు తగ్గింది. దేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. తెలిపింది. ఇక, మొత్తం ఆదాయం 3 శాతం వృద్ధితో 891.19 కోట్లకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.865.12 కోట్లుగా ఉంది. తయారీ సంస్థలతో ఒప్పందాల కారణంగా ఎగుమతుల వ్యాపారంలో 77 శాతం వృద్ధి నమోదైంది.
కొత్త బోర్డ్‌ సభ్యుల నియామకం...
ఎన్‌ఏసీఎల్‌కు ఎండీ అండ్‌ సీఈఓగా ఎం పవన్‌ కుమార్‌ నియామకాన్ని బోర్డు ఆమోదించింది. ఈయనతో పాటూ క్రిషీ రాసయాన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (కేఆర్‌ఈపీఎల్‌) ఎండీ, జాయింట్‌ ఎండీలు అతుల్‌ చురివాల్, రాజేష్‌ కుమార్‌ అగర్వాల్‌లు, ప్రముఖ అగ్రికల్చర్‌ కన్సల్టెంట్‌ కే దొరైరాజ్‌లు ఎన్‌ఏసీఎల్‌లో కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు.

  • ‍ఎమ్‌ఎమ్‌టీసీ లాభం 8 శాతం డౌన్‌

- రెట్టింపయిన ఆదాయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్‌, లోహ కంపెనీ ఎమ్‌ఎమ్‌టీసీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో​‍త్రైమాసికంలో 8 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.13 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.11.8 కోట్లకు తగ్గినట్లు ఎమ్‌ఎమ్‌టీసీ తెలియజేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.3,111 కోట్ల నుంచి రెట్టింపై రూ.7,108 కోట్లకు ఎగసిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.3,098 కోట్ల నుంచి రూ.7,108 కోట్లకు ఎగిశాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎమ్‌ఎమ్‌టీసీ షేర్‌ 1.2 శాతం లాభంతో రూ.27.45 వద్ద ముగిసింది. 

  • బెర్జర్‌ పెయింట్స్‌ లాభం రూ.111 కోట్లు

- ఒక్కో షేర్‌కు రూ.1.90 డివిడెండ్‌
న్యూఢిల్లీ: బెర్జర్‌ పెయింట్స్‌ ఇండియా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018-19) మార్చి త్రైమాసికంలో రూ.111 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.106 కోట్లతో పోలిస్తే 5 శాతం క్షీణత నమోదైందని బెర్జర్‌ పెయింట్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,298 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.1,472 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.1,136 కోట్ల నుంచి రూ.1,305 కోట్లకు చేరాయి. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.1.90 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. 
ఏడాది లాభం రూ.497 కోట్లు...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.461 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.497 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. మొత​ం ఆదాయం రూ.5,282 కోట్ల నుంచి రూ.6,062 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

  • కోల్‌ ఇండియా లాభం రూ.6,024 కోట్లు

కోల్‌కత: మైనింగ్‌ దిగ్గజం కోల్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.6,024 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.1,303 కోట్లు)తో పోల్చితే 362 శాతం వృద్ది చెందిందని కోల్‌ ఇండియా తెలిపింది. అమ్మకాలు రూ.24,747 కోట్ల నుంచి రూ.26,704 కోట్లకు పెరిగాయని పేర్కొంది. 

పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.7,038 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 148 శాతం వృద్ధితో రూ.17,462 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది.



You may be interested

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌

Friday 31st May 2019

మోదీ 2.0 క్యాబినెట్‌లో నిర్మలాసీతారామన్‌ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఉన్న నిర్మల తొలిసారి ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఆమె కార్పొరేట్‌ వ్యవహారాల శాఖను కూడా పర్యవేక్షిస్తారు. తొలుత నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆర్థిక మంత్రి బాధ్యతలు స్వీకరించవచ్చని ఊహాగానాలు వినిపించాయి. మోదీ తన తర్వాత వారసుడిగా అమిత్‌షాను ఎంచుకుంటారని, క్రమంగా వచ్చే ఎన్నికల నాటికి ఆయనే కీలక

‘పీపీపీ’ ఇంకా బలపడాలి

Friday 31st May 2019

భాగస్వామ్యంతోనే వృద్ధి మరింత వేగం నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఉద్ఘాటన నూతన ప్రభుత్వానికి ఎజెండా రూపకల్పన న్యూఢిల్లీ: ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ తిరిగి భారీ మెజారిటీని సొంతం

Most from this category