STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీ క్యూ2 ఫలితాల వివరాలు

Wednesday 13th November 2019
news_main1573615643.png-29545

  • 4.6 శాతం పెరిగిన అరబిందో లాభం

 ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా నికరలాభం పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ.611.4 కోట్లతో పోలిస్తే 4.6 శాతం పెరిగి రూ.639.5 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.4,751.4 నుంచి 18 శాతం వృద్ధితో రూ.5,600.6 కోట్లకు ఎగసింది. ‘‘అమెరికా, యూరప్‌ మార్కెట్లలో చక్కని వృద్ధి నమోదు కావటంతో ఈ త్రైమాసికంలోనూ ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించాం. మా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు సరైన దిశలో సాగుతున్నాయి. మా తొలి బయో సిమిలర్‌ ఉత్పాదనకు సంబంధించి వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలుపెడతాం’’ అని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టరు ఎన్‌.గోవిందరాజన్‌ చెప్పారు. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మధ్యంతర డివిడెండు రూ.1.25 చొప్పున చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. 

సన్‌ టీవీ లాభంలో స్వల్ప వృద్ధి
సన్‌ టీవీ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసిక కాలంలో రూ.369 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.365 కోట్లతో పోలిస్తే 1 శాతం వృద్ధి సాధించామని సన్‌ టీవీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.843  కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.901 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.301 కోట్ల నుంచి 66 శాతం ఎగసి రూ.500 కోట్లకు చేరాయి. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు 50 శాతం డివిడెండ్‌ (రూ.2.50) ఇవ్వనున్నామని తెలిపింది. 

35 శాతం తగ్గిన నాట్కో లాభం
ఔషధ తయారీ సంస్థ నాట్కో ఫార్మా నికరలాభం తగ్గింది. సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం కిందటేడాది ఇదే కాలంతో పోలిస్తే 35 శాతం తగ్గి రూ.118 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు రూ.583 కోట్ల నుంచి రూ.519 కోట్లకు తగ్గింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండవ మధ్యంతర డివిడెండుగా రూ.1 చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. 

పెన్నార్‌ లాభం 86.5 శాతం జంప్‌
పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ సెప్టెంబరు క్వార్టరులో రూ.23.5 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 86.5 శాతం వృద్ధి చెందింది. టర్నోవరు రూ.528 కోట్ల నుంచి రూ.588 కోట్లకు ఎగసింది. షేర్ల బైబ్యాక్‌కు మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.45 మించకుండా ఓపెన్‌ మార్కెట్లో కొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. You may be interested

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Wednesday 13th November 2019

భెల్‌, కేడిలా హెల్త్‌కేర్‌, ఏబీబీ ఇండియా, ఐఆర్‌సీటీసీ, నాల్కో, ఆర్‌సీఎఫ్‌, సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌, థెరాక్స్‌, బజాజ్‌ హిందూస్థాన్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌, బ్లూ స్టార్‌, హుడ్కో, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, బాటా ఇండియా, సద్భవన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, అదానీ పవర్‌, అశోకా బిల్డ్‌కాన్‌, జాగరణ్‌ ప్రకాషన్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, ఎంఫసీస్‌, బాలజీ టెలీఫిల్మ్స్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఈ ఆర్థిక

ఇన్ఫీ సీఈవోకు మరో విజిల్‌ ‘బ్లో’!

Wednesday 13th November 2019

(అప్‌డేటెడ్‌) నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మరిన్ని ఆరోపణలు సొంత వ్యాపారాల కోసం ముంబైలోనే ఉంటున్నారు కంపెనీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారు విదేశీ టూర్లలో కూడా అధికారిక పనులేమీ లేవు ఇంత అధ్వాన్నమైన సీఈఓను చూడలేదు చైర్మన్‌కు కంపెనీ ఉద్యోగి అజ్ఞాత లేఖ చైర్మన్‌కు మరో ప్రజావేగు ఫిర్యాదు బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్ పరేఖ్‌పై విజిల్‌ బ్లోయర్ల (ప్రజావేగుల) ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరిన్ని ఆరోపణలు గుప్పిస్తూ.. మరో ప్రజావేగు ఫిర్యాదు చేశారు. నియామక నిబంధనల ప్రకారం ప్రధాన

Most from this category