News


మైనింగ్‌కు అది వర్తించదు

Friday 6th December 2019
news_main1575602708.png-30081

  • 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్‌పై ఆర్థిక మంత్రి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్‌ విధించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌, మైనింగ్‌, పుస్తకాల ముద్రణకు ఇది వర్తించదని పేర్కొన్నారు. ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019 ప్రకారం నెగటివ్ లిస్టులో ఇవి ఉన్నట్లు గురువారం రాజ్యసభకు ఆమె తెలిపారు. వీటిని తయారీ కింద పరిగణనలోకి తీసుకోకపోవడం ఇందుకు కారణమని పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించిన సంగతి తెలిసిందే. 



You may be interested

'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి'గా నీరవ్ మోదీ

Friday 6th December 2019

ప్రకటించిన ముంబై కోర్టు ఆస్తుల జప్తునకు మార్గం సుగమం ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి దాదాపు 2 బిలియన్ డాలర్ల టోకరా వేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి'గా (ఎఫ్‌ఈవో) ముంబై కోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్ధనతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది.

ఈ సారికి... ఏమీ లేదు!!

Friday 6th December 2019

(అప్‌డేటెడ్‌...) రెపో, రివర్స్‌ రెపో రేట్లు యథాతథం తాత్కాలిక విరామం ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయం ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఆందోళనలే కారణం జీడీపీ వృద్ధి అంచనాలు 5 శాతానికి తగ్గింపు మున్ముందు పరిస్థితులు మెరుగుపడితే చూస్తాం మందగమనం పోయిందని ఇప్పుడే చెప్పలేం రిజర్వు బ్యాంకు గవర్నరు శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు ముంబై: విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి రేట్ల కోతకు వెళ్లకుండా యథాతథ పరిస్థితికి మొగ్గు చూపించింది. ప్రస్తుతమున్న రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే

Most from this category