News


వియ్‌వర్క్‌కు సాఫ్ట్‌బ్యాంకు 9.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ

Thursday 24th October 2019
news_main1571887491.png-29094

టోక్యో: సంక్షోభంలో చిక్కుకున్న ఆఫీస్‌-షేరింగ్ సేవల స్టార్టప్ సంస్థ వియ్‌వర్క్‌ను గట్టెక్కించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ తాజాగా 9.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో 5 బిలియన్ డాలర్లు కొత్తగా ఇన్వెస్ట్ చేయడంతో పాటు ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసేందుకు 3 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. షేర్ల కొనుగోలు ప్రక్రియ ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ తెలిపారు. ప్రస్తుతం వియ్‌వర్క్‌లో 29 శాతంగా విన్న సాఫ్ట్‌బ్యాంక్ వాటా.. షేర్ల కొనుగోలుతో సుమారు 80 శాతానికి చేరనుంది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు చెందిన మార్సెలో క్లార్‌.. ఇకపై వియ్‌వర్క్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా చేరతారు. ఇప్పటికే సీఈవో పదవి నుంచి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చిన సహ-వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమన్‌కు ప్యాకేజీలో భాగంగా 1.5 బిలియన్ డాలర్లు లభించనున్నాయి. ఆయన బోర్డు నుంచి కూడా నిష్క్రమించి 'పరిశీలకుడి' పాత్రకు పరిమితమవుతారు.  కంపెనీలో స్వల్ప వాటాలు వింటాయి. సుమారు 47 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఐపీవోకి రావాల్సిన వియ్‌వర్క్‌ పలు ప్రతికూలాంశాల కారణంగా సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. కంపెనీకి తక్షణం 3 బిలియన్ డాలర్ల నిధులు అవసరమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌బ్యాంక్ మరింతగా ఇన్వెస్ట్ చేస్తుండటం వియ్‌వర్క్‌కు ఊరటనివ్వనుంది. 



You may be interested

వైద్య సేవల్లోకి కత్రియ గ్రూప్‌

Thursday 24th October 2019

ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్‌ ఏర్పాటు మొత్తం రూ.350 కోట్ల పెట్టుబడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఆతిథ్య రంగంలో ఉన్న కత్రియ గ్రూప్‌ వైద్య సేవల్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద ఎస్‌ఎల్‌జీ పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 550 పడకలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ సీఎండీ దండు శివ రామ రాజు బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. 2022 నాటికి ఆసుపత్రిని 999 పడకల స్థాయికి చేరుస్తామని వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టు

హెచ్‌సీఎల్‌ టెక్‌ 1:1 బోనస్‌

Thursday 24th October 2019

7 శాతం వృద్ధితో రూ.2,711 కోట్లకు నికర లాభం  ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ ఆదాయ అంచనాలు పెంపు  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ బోనస్‌ షేర్లను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఒక్కో షేర్‌ను (1:1)ఉచితంగా ఇవ్వనునున్నది. అంతే కాకుండా ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర లాభం 7 శాతం పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. గత

Most from this category