News


పేటీఎమ్‌కు రూ.4,724 కోట్ల పెట్టుబడులు

Saturday 14th December 2019
news_main1576296823.png-30224

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్‌ మాతృసం‍స్థ, వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్‌లైన్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్‌ నిర్వహణలోని ఫండ్స్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్‌ పాంథర్‌(కేమ్యాన్‌) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ టోఫ్లర్‌ పేర్కొంది. ఈ విషయమై పేటీఎమ్‌ స్పందించలేదు. కాగా ఈఏడాది నవంబర్‌లోనే పేటీఎమ్‌ సంస్థ అమెరికాకు చెదిన టి రొవె ప్రైస్‌, సాఫ్ట్‌బ్యాంక్‌, అలీబాబాల నుంచి రూ.7,000 కోట్ల మేర పెట్టుబడులు సమీకరించింది. వ్యాపార విస్తరణ కోసం మూడేళ్లలో రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొంది. 



You may be interested

నిఫ్టీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌!

Saturday 14th December 2019

నిఫ్టీ వరుసగా మూడో సెషన్‌లో(శుక్రవారం) కూడా గ్యాప్‌అప్‌తో ఆరంభమై మంచి లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో 12099 పాయింట్లను తాకింది. ప్రస్తుతం నిఫ్టీ డైలీ, వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్స్‌ ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ క్యాండిల్స్‌ హయ్యర్‌ హై, హయ్యర్‌లో రూపంలోఉన్నాయి. ఇలాంటి క్యాండిల్స్‌ ఏర్పడడం బుల్లిష్‌నెస్‌కు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడు సెషన్ల అప్‌మూవ్‌తో ప్రస్తుత కరెక‌్షన్‌ 11832 పాయింట్ల వద్ద బాటమ్‌ అవుట్‌ అయినట్లు భావిస్తున్నారు. నిఫ్టీ ఇండికేటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌

Saturday 14th December 2019

5 వేల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌ అయ్యాయి. 2016–17, 2017–18 వరుసగా రెండేళ్లు వార్షిక రిటర్న్‌లు, బ్యాలెన్స్‌ షీట్లను ఫైల్‌ చేయని కారణంగా సెక్షన్‌ 248 ప్రకారం ఈ కంపెనీలను స్ట్రయిక్‌ ఆఫ్‌ చేసినట్లు ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌ (ఐసీఎల్‌ఎస్‌) సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. తొలిసారిగా ఈ సారి స్ట్రయిక్‌ ఆఫ్‌ అయిన కంపెనీల

Most from this category