News


ఎస్‌బీఐ చేతిలో యస్‌బ్యాంక్‌ సురక్షితం: రాణా కపూర్‌

Saturday 7th March 2020
news_main1583568742.png-32350

యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ వ్యూహాత్మక వాటా కొనుగోలును యస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ స్వాగతించారు. యస్‌ బ్యాంకు ఎస్‌బీఐ చేతుల్లోకి వెళ్లడంతో సరైన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్‌ అయిందని, వాటా కొనుగోలుకు ప్రక్రియ విధానం, అందుకు తీసుకున్న కాలవ్యవధి సరైన పద్ధతిలోనే ఉన్నట్లు రాణాకపూర్‌ చెపుతున్నారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. వివరాలు...

యస్‌బ్యాంక్‌ ఇటీవల చేపట్టిన భారీ నిధుల సమీకరణ ఇష్యూ (లేదా) క్యూఐపీ కంటే కూడా ఎస్‌బీఐ నిర్ణయాత్మక వాటాను కలిగి ఉంది అనే అంశమే యస్‌బ్యాంక్‌కు బాగా కలిసి వస్తుందని ఆయన తెలిపారు. గతంలో బ్యాంకు క్యూఐపీ, బాండ్ల ద్వారా మూలధన సమీకరణకు వెళ్లినపుడు విజయవంతమైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన పదవీకాలం ముగిసినపుడు బ్యాంకు మొత్తం మూలధన నిధులు రూ.52వేల కోట్లుగా ఉన్నట్లు రాణా తెలిపారు. 

ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులతో చర్చలు జరిపినప్పటికీ, సరైన పునురుజ్జీవన ప్రణాళికలు లేనందునే యస్‌బ్యాంక్‌ ఆర్‌బీఐ  జోక్యం చేసుకున్నట్లు రాణాకపూర్‌ అభిప్రాయపడ్డారు. కంపెనీ(లేదా) బ్యాంకు ఏదో ఒక కార్పోరేట్‌ అంశంలో విఫలమైనంత మాత్రాన నియంత్రణ సంస్థలు జోక్యం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నకు బదులిస్తూ... ఆరేడు నెలల నుంచి మూలధనాన్ని సమీకరించడంలో బ్యాంక్‌ యాజమాన్యం, బోర్డు శాయశక్తులా కృషి చేశాయి. అయితే దురదృష్టవశాత్తు బ్యాంక్‌లో ఇబ్బందులు మరింత విషమించడంతో బ్యాంకు మూలధనం మరింత కరిగిపోకుండా, డిపాజిటర్లను నిలుపుకోవటానికి ఆర్‌బీఐ ఈ చర్యకు పాల్పడిందని ఆయన అన్నారు. 

యస్‌బ్యాంక్‌లాంటి చిన్న పరిమాణం కలిగిన బ్యాంక్‌లో ఆర్‌బీఐ చాలా జోక్యం చాలా అరుదుగా ఉంటుంది. కొన్నేళ్ల కిందట గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ను ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో విలీనం చేసింది. బ్యాంక్‌ ప్రారంభంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ప్రియమైన షేరుగా ఉంటే యస్‌ బ్యాంక్‌ ఇప్పుడు తనను రక్షించుకోలేకపోతుందని అంశంపై స్పందిస్తూ... ఈ ఇష్యూపై తాను వ్యాఖ్యానించలేనని రాణా తెలిపారు. ‘‘ ఏడాది కిందట వరకు బ్యాంకింగ్‌ రంగంలో యస్‌బ్యాంక్‌ అత్యుత్తమ స్థానంలో కొనసాగింది. అన్ని విభాగాల ఇన్వెస్టర్ల నుంచి మూలధన నిధులను సమీకరించగలిగింది. అయితే ఈ ఏడాది కాలవ్యవధిలో నిధుల సమీకరణ చేయలేకపోవడంతో పాటు ఎస్‌బీఐ వాటా విక్రయానికి ఆమోదం తెలిపారు. అయితే దేశంలో ఎస్‌బీఐ కంటే మంచి పేరున్న కంపెనీ లేదు. ఎస్‌బీఐ వాటా కొనుగోలుతో యస్‌బ్యాంక్‌ మూలధన సమీకరణ కష్టాలు తీరుతాయి. యస్‌ బ్యాంక్‌ కథ కంచికి చేరుకుండా సజీవంగా ఉంటుంది. ఎస్‌బీఐ బ్యాంక్‌ ప్రధాన ప్రమోటర్‌ కావడంతో ఇప్పుడు రుణగ్రహితలు గతంలో ప్రదర్శంచిన నిర్లక్ష్య ధోరణి విడిచి రుణాలకు చెల్లింపులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు యస్‌బ్యాంక్‌ సరైన,సురక్షిత చేతుల్లోకి వెళ్లింది.’’ అని రాణా అభిప్రాయపడ్డారు. 

యస్‌బ్యాంక్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన పునరుజ్జీవన ప్రణాళికను రూపొందించింది. బ్యాంక్‌ షేరు హోల్డర్లకు మీరిచ్చే సమాధానం ఏమిటిని అడగ్గా... ఎస్‌బీఐ లాంటి బలమైన యాజమాన్యం యస్‌బ్యాంక్‌ను కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తుంది. ఎస్‌బీఐ సారథ్యంలో యస్‌బ్యాంక్‌ నాల్జెడ్‌ బ్యాంకింగ్‌ వ్యూహాన్ని నిలుపుకుంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. బ్రాంచ్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్, ఎంఎస్‌ఎంఈ, ట్రేడ్ ఫైనాన్స్ స్ట్రాటజీలను నిర్మించే దిశగా పనిచేస్తున్న సరళ దిశ వ్యాపార నమూనా మరింత ముందుకు సాగుతుందని రాణా అభిప్రాయపడ్డారు.

యస్‌బ్యాంక్‌ పదవికి రాజీనామా అనంతరం తన పూర్తి సమయాన్ని తన భార్య, పిల్లలతోనే గడుపుతున్నామని, కొందరు చెబుతున్నట్లు తాను ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని ఆ సందర్భంగా రాణా స్పష్టతనిచ్చారు. You may be interested

రూపాయ్‌@ 74- 17 నెలల కనిష్టం

Saturday 7th March 2020

గత వారం 4 రోజులపాటు పతనమే వారాంతాన సైతం 54 పైసలు మైనస్‌ 74 చేరువలో ముగింపు ఇం‍ట్రాడేలో 74.08కు రూపాయి డాలరుతో మారకంలో ఇటీవల నేలచూపులకే పరిమితమవుతూ వస్తున్న దేశీ కరెన్సీ శుక్రవారం మరింత నీరసించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 54 పైసలు పతనమైంది. 73.87 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో కనిష్టంగా 74.08ను తాకింది. గురువారం ఒక్క రోజు మినహాయిస్తే గత వారమంతా దేశీ కరెన్సీ క్షీణ పథంలోనే సాగింది. వెరసి శుక్రవారం(6)తో

బంగారం ధర పెరగడానికి కరోనా ఒక్కటే కారణం కాదు...!

Saturday 7th March 2020

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పీఆర్‌ సోమసుందరం చైనాలో కరోనా వైరస్‌ వ్యాపించి వందల్లో మరణాలు సంభవిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడులపై పరుగులు పెడుతూ ఎక్కువమంది బంగారం కొనుగోళ్లు చేపట్టడం చూశామని ప్రముఖ విశ్లేషకులు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల ఇండియా ఎండీ పీఆర్‌ సోమసుందరం అన్నారు. తన కాలంలో సోమసుందరం ఈ విధంగా వ్యాఖ్యానించారు. కరోనా భయంతో బంగారం ఒక్కసారిగా ఏడేళ్ల గరిష్టానికి చేరింది. ఇంకా పైకి

Most from this category