News


రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్‌ విస్తరణ

Friday 29th November 2019
news_main1574998873.png-29939

  • ప్రాసెసింగ్‌, స్టోరేజీ సామర్థ్యం పెంపు
  • త్వరలో కంపెనీ నుంచి ఫ్రోజెన్‌ చికెన్‌
  • రెడీ టు ఈట్‌ విభాగంలోకి సైతం

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- పౌల్ట్రీ రంగ సంస్థ స్నేహా ఫామ్స్‌ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రాసెసింగ్‌ కెపాసిటీ గంటకు 6,000 బర్డ్స్ నుంచి 12,000లకు చేర్చనుంది. అలాగే కోల్డ్‌ స్టోరేజీ సామర్థ్యం ప్రస్తుతం 2,000 టన్నులుంది. దీనికి 3,000 టన్నులకు పెంచనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకల్‌ వద్ద కంపెనీకి ప్రాసెసింగ్‌ ప్లాంటుతోపాటు శీతల గిడ్డంగి ఉంది. సంస్థ ఇప్పటికే ప్రాసెస్డ్‌ చికెన్‌, ఫ్రెష్‌ చికెన్‌ విక్రయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో నిలిచింది. అలాగే ప్రాసెసింగ్‌ కెపాసిటీ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎనమిది నెలల్లో ఈ విస్తరణ పూర్తి అవుతుందని స్నేహా ఫామ్స్‌ ఎండీ డి.రామ్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. నూతన విభాగాల్లోకి ప్రవేశించేందుకు తాజా విస్తరణ దోహదం చేస్తుందన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మెగా ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పొందామని చెప్పారు. 
కొత్త విభాగాల్లోకి స్నేహా...
స్నేహా ఫామ్స్‌ త్వరలో నగ్గెట్స్‌, లాలీపాప్స్‌ వంటి రెడీ టు కుక్‌, చికెన్‌ కర్రీ వంటి ఉత్పత్తులతో రెడీ టు ఈట్‌ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే అయిదారు ఉత్పత్తులతో ట్రయల్స్‌ నిర్వహించామని రామ్‌ రెడ్డి తెలిపారు. ‘ఫ్రోజెన్‌ చికెన్‌ విభాగంలోకి కూడా వస్తున్నాం. రెడీ టు ఈట్‌ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాం. ఇప్పటికే దాణాను ఎగుమతి చేస్తున్నాం. సఫల బ్రాండ్‌ కింద సోయా, రైస్‌ బ్రాన్‌ ఆయిల్స్‌ దేశీయంగా విక్రయిస్తున్నాం. 80,000 కిలోల ప్రాసెస్డ్‌ చికెన్‌, 2.5 లక్షల బ్రాయిలర్‌ కోళ్లు ప్రతిరోజు అమ్ముతున్నాం. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.3,000 కోట్లుంది. ఇందులో స్నేహా ఫామ్స్‌ వాటా రూ.2,500 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌లో 15-20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణతో కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. 



You may be interested

తొలి ఎన్‌బీఎఫ్‌సీ కమర్షియల్‌ పేపర్ల లిస్టింగ్‌

Friday 29th November 2019

ముంబై: నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఆదిత్య బిర్లా ఫైనాన్స్ (ఏబీఎఫ్‌ఎల్‌) తమ కమర్షియల్ పేపర్స్‌ను (సీపీ) స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేసింది. తద్వారా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా నిల్చింది. ఈ సీపీ ద్వారా ఏబీఎఫ్‌ఎల్ రూ. 100 కోట్లు సమీకరించింది. వీటి మెచ్యూరిటీ గడువు 2020 ఫిబ్రవరి 7గా ఉంటుందని స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన

ఏటా 200 కొత్త శాఖలు:ముత్తూట్‌

Friday 29th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ముత్తూట్‌ ఫిన్‌కార్‌‍్ప దేశవ్యాప్తంగా ఏటా 200 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సంస్థకు 3,600 సెంటర్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 265, ఆంధ్రప్రదేశ్‌లో 317 నెలకొన్నాయని ముత్తూట్‌ ఫిన్‌కార్‌‍్ప చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వాసుదేవన్‌ రామస్వామి తెలిపారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోల వినోద్‌ కుమార్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో

Most from this category