News


ఔషధాలను విక్రయిస్తున్నందుకు స్నాప్‌డీల్‌పై విచారణ

Thursday 10th January 2019
Markets_main1547099508.png-23501

బెంగళూరు: ఆన్‌లైన్‌లో నియంత్రిత ఔషధాలను చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నందుకు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన విచారణ చర్యలు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.‘‘షెడ్యూల్డ్‌ హెచ్‌ డ్రగ్‌ ‘సుహాగ్రా 100’ ప్రదర్శన, విక్రయం, పంపిణీ చేస్తున్నందుకు గాను స్నాప్‌డీల్‌, ఆ సంస్థ సీఈవో కౌర్‌బాహల్‌, సీవోవో రోహిత్‌కుమార్‌ బన్సాల్‌కు వ్యతిరేకంగా విచారణ చర్యలు తీసుకునేందుకు బెళగావికి చెందిన అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ను అనుమతిస్తూ డిసెంబర్‌ 21న ఆదేశాఉలు ఇవ్వడం జరిగింది. ఈ ఔషధాన్ని ఓవర్‌ ద కౌంటర్‌ విక్రయించకూడదు. ఇది ఔషధ, సౌందర్య ఉత్పత్తుల నిబంధనలకు వ్యతిరేకం’’అని కర్ణాటక డ్రగ్‌ కంట్రోలర్‌ అమరేష్‌ తుంబగి బుధవారం మీడియాకు తెలిపారు. లుథినాయాకు చెందిన హెర్బల్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ యజమాని, ఉద్యోగులకు వ్యతిరేకంగా కూడా విచారణ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. లైంగిక ఉద్దీపనానికి వినియోగించే సుహాగ్ర ఔషధాన్ని వైద్యుల సిఫారసు లెటర్‌ లేకుండా విక్రయించకూడదని స్పష్టం చేశారు.
చట్టానికి సహకరిస్తాం: స్నాప్‌డీల్‌
ఈ విషయానికి సంబంధించి తమకు ఎటువంటి సమచారం లేదని, విచారణ అధికారులకు సహకారం అందిస్తామని స్నాప్‌డీల్‌ ప్రకటన జారీ చేసింది. ‘‘స్నాప్‌డీల్‌ అనేది మధ్యవర్తి. విక్రేతలను, కొనుగోలుదారులతో అనుసంధానిస్తుంది. షెడ్యూల్డ్‌ హెచ్‌ విభాగంలోని ఔషధాలను విక్రయించకుండా నిషేధం ఉంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. అటువంటి విక్రేతలు ఇకపై అమ్మకాలు జరపకుండా నిషేధం విధిస్తాం’’ అని స్నాప్‌డీల్‌ అధికార ప్రతినిధి ప్రకటనలో వివరించారు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసేందుకు తమ వైపు నుంచి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.



You may be interested

సెప్టెంబర్‌ తర్వాత ఎయిర్‌ ఇండియా అమ్మకం

Thursday 10th January 2019

రూ.7,000 కోట్లు వస్తుందని అంచనా న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాలో వాటాల విక్రయం ద్వారా బిలియన్‌ డాలర్లు (రూ.7,000 కోట్లు సుమారు) లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థ భాగంలో ఎయిర్‌ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను చేపట్టనుంది. ఈ లోపు ఎయిర్‌ ఇండియా అనుబంధ కంపెనీలను విక్రయించనుంది. ఈ వివరాలను ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఎయిర్‌ ఇండియాకు రూ.55,000

భారత్‌ వృద్ధి తీరు భేష్‌

Thursday 10th January 2019

- ఆర్థిక దిగ్గజాల విశ్లేషణ - 2018-19లో వృద్ధి 7.3 శాతమని ప్రపంచబ్యాంక్‌ అంచనా - మూడవ అతిపెద్ద వినిమయ మార్కెట్‌గా అవతరిస్తుందన్న డబ్ల్యూఈఎఫ్‌ - వృద్ధికి ప్రభుత్వ చర్యలు దోహదపడతాయన్న పీడబ్ల్యూసీ- ఫిక్కీ సర్వే వాషింగ్టన్‌/ముంబై: భారత్‌ ఆర్థిక వ్యవస్థపై సానుకూల అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతంగా ఉంటుందని తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. ఇక వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ఒక నివేదిక విడుదల చేస్తూ,

Most from this category