News


చిన్న పొదుపులపై వడ్డీ తగ్గింపు!

Thursday 19th March 2020
news_main1584587613.png-32566

న్యూఢిల్లీ: చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. వచ్చే త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌) సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న సరళతర వడ్డీరేట్ల విధానం ఈ నిర్ణయానికి నేపథ్యం కానుంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రస్తుత త్రైమాసికంలో (జనవరి-మార్చి) కేంద్రం తగ్గించలేదు. అయితే చిన్న పొదుపు పథకాలపై ఇస్తున్న వడ్డీరేట్లు ఇప్పటికీ బ్యాంకింగ్‌తో పోల్చితే ఎక్కువగా ఉన్నాయనీ, దీనివల్ల దాదాపు అదే స్థాయిలో తమ డిపాజిట్లపై వడ్డీరేట్లనూ కొనసాగించాల్సి వస్తోందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఈ ధోరణి వల్ల తాము ఇస్తున్న రుణాలపై వడ్డీరేట్లనూ తగ్గించలేని పరిస్థితులు ఉన్నాయని బ్యాంకింగ్‌ పేర్కొంటోంది. ఆయా అంశాల నేపథ్యంలో వచ్చే త్రైమాసికానికి సంబంధించి చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు అధికంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏడాది మెచ్యూరిటీకి సంబంధించి బ్యాంకులు, చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్ల మధ్య దాదాపు ఒక శాతం (100 బేసిస్‌ పాయింట్లు) వడ్డీరేటు వ్యత్యాసం ఉంది.  చిన్న పొదుపు మొత్తాలపై త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీరేట్ల మార్పు నిర్ణయం ఉంటుంది. 



You may be interested

యస్‌ బ్యాంక్‌పై మారటోరియం ఎత్తివేత

Thursday 19th March 2020

- బ్యాంకింగ్ సేవలన్నీ పునరుద్ధరణ - మూడు రోజుల పాటు వేళల పొడిగింపు ముంబై:  ప్రైవేట్ రంగ యస్ ‍బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే

భారత్‌ ‘వృద్ధి’కి ఎస్‌అండ్‌పీ కోత

Thursday 19th March 2020

- 5.7 శాతం నుంచి 5.2 శాతానికి కుదింపు - మూడీస్‌ అంచనాకన్నా తక్కువ న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్‌ దిగ్గజ సంస్థ ఎస్‌అండ్‌పీ కోత పెట్టింది. క్యాలెండర్‌ ఇయర్‌లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా  నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక

Most from this category