News


హైదరాబాద్‌లో తగ్గిన గృహాల విక్రయాలు

Tuesday 30th July 2019
news_main1564466357.png-27407

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌ – జూన్‌ మధ్య కాలంలో అమ్మకాల్లో 6 శాతం గ్రోత్‌ కనిపించిందని ప్రాప్‌ఈక్విటీ సర్వే తెలిపింది. అయితే ఇదే సమయంలో కొత్త గృహాల సప్లయిలో మాత్రం 11 శాతం క్షీణత నమోదైందని సర్వే పేర్కొంది.
5,89,503 గృహాల ఇన్వెంటరీ...
గుర్గావ్, నోయిడా, ముంబై, కోల్‌కతా, పుణే, హైదరాబాద్, బెంగళూరు, థానే, చెన్నై నగరాల్లో ఏప్రిల్‌ – జూన్‌ మధ్య కాలంలో 61,789 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి అమ్మకాలు 58,292 యూనిట్లుగా ఉన్నాయి. ఇక, కొత్త గృహాలు ప్రారంభాలు ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌లో 51,108 యూనిట్లుగా కాగా.. గతేడాది ఇదే సమయంలో 57,425 గృహాలుగా ఉన్నాయి. విక్రయం కాకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 5,89,503 యూనిట్లుగా ఉన్నాయి.
విక్రయాలు నగరాల వారీగా చూస్తే...
హైదరాబాద్‌లో ఏప్రిల్‌ – జూన్‌లో 4,219 గృహాలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం తగ్గుదల. బెంగళూరులో 10,859 యూనిట్లు, చెన్నైలో 4,687, పుణేలో 16,025, ముంబైలో 6,125, గుర్గావ్‌లో 2,378 గృహాలు విక్రయమయ్యాయి. 2018 తర్వాత నుంచి డెవలపర్లు కొత్త గృహాల ప్రారంభాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారని ప్రాప్‌ ఈక్విటీ ఫౌండర్‌ అండ్‌ ఎండీ సమీర్‌ జాసుజా తెలిపారు. ధరలను అందుబాటులో ఉంచేందుకు ఫ్లాట్ల విస్తీర్ణాలను తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. You may be interested

రెండు రెట్లు పెరిగిన డీఎల్‌ఎఫ్‌ లాభం

Tuesday 30th July 2019

రూ.415 కోట్లకు నికర లాభం  న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం, డీఎల్‌ఎఫ్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.173 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.415 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. రూ.297 కోట్ల అసాధారణ ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,658 కోట్ల నుంచి రూ.1,541 కోట్లకు

వెలుగులోకి మాల్యా కొత్త షెల్‌ కంపెనీలు

Tuesday 30th July 2019

అక్రమంగా నిధుల మళ్లింపు కేసులో ఈడీ గుర్తింపు అనుచరుడి ఇంట్లో సోదాలు న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు ఉడాయించిన విజయ్‌ మాల్యా కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అనుచరుల ద్వారా డొల్ల(షెల్‌) కంపెనీలను సృష్టించి వాటిద్వారా నిధులను(బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను) మాల్యా తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వెలుగులోకి తెచ్చింది. ఈ లావాదేవీల్లో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తూ కొన్ని షెల్‌ కంపెనీలను(యునైటెడ్‌ బ్రాండింగ్‌ వరల్డ్‌వైడ్‌

Most from this category