STOCKS

News


భారత్‌లో కష్టమే..

Wednesday 13th November 2019
news_main1573613823.png-29539

  • మరిన్ని పెట్టుబడులు పెట్టేదిలేదు
  • ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే ఇక అంతే..
  • వోడాఫోన్‌ యూకే సీఈఓ నిక్‌రీడ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ సీఈవో నిక్ రీడ్ వ్యాఖ్యానించారు. వొడాఫోన్‌- ఐడియా జాయింట్ వెంచర్‌ మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా రీడ్ ఈ విషయాలు చెప్పారు. "చాన్నాళ్లుగా భారత్‌ సవాళ్ల మయంగా ఉంటోంది. అనుకూలంగా లేని నిబంధనలు, భారీ పన్నులు.. వీటికి తోడు సుప్రీం కోర్టు నుంచి ప్రతికూల తీర్పు .. ఇవన్నీ కలిసి సంస్థకి ఆర్థికంగా పెనుభారం అవుతున్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం చార్జీల కింద భారత్‌లో సుమారు రూ.40 వేల కోట్ల దాకా బకాయిలు వొడాఫోన్‌- ఐడియా కట్టాల్సి రావొచ్చని అంచనా. దీంతో పాటు ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య కాలంలో వొడాఫోన్ భారత విభాగం నిర్వహణ నష్టాలు 692 మిలియన్ యూరోలకు ఎగిశాయి. ఈ నేపథ్యంలో రీడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజా పరిణామాలతో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్‌ వెల్లడించింది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచీ ఏదో ఒక విషయంలో వొడాఫోన్ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. 
స్పెక్ట్రం వేలంలో పాల్గొనేదెవరు: సీవోఏఐ
5జీ సేవలకు సంబంధించి కావాలనుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని.. కాకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాత టెల్కోలు ఇందులో పాల్గొనకపోవచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు ప్రతికూల తీర్పుతో పాటు ఆర్థిక సంక్షోభంతో టెల్కోలు కుదేలవుతున్నాయని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. "ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్పెక్ట్రం వేలం వేయాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ బిడ్డింగ్‌లో ఎవరు పాల్గొంటారన్నదే ప్రశ్న. ఒకవేళ వేలం వేసినా.. ఎవరికీ స్పెక్ట్రంపై గుత్తాధిపత్యం కట్టబెట్టకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి" అని మాథ్యూస్ పేర్కొన్నారు. You may be interested

మున్ముందు ఎన్‌పీఏలు మిలీనియల్స్‌వేనా?

Wednesday 13th November 2019

ఈ విభాగంలో అత్యధికం అన్‌సెక్యూర్డ్‌ రుణాలే ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ నివేదికలో వెల్లడి ముంబై: మిలీనియల్స్‌ (1980- 2000మధ్య జన్మించినవారు) తీసుకుంటున్న రుణాలు బ్యాంకులకు భవిష్యత్తు మొండి బకాయిలుగా (ఎన్‌పీఏలు) మారనున్నాయా..? గత రెండు సంవత్సరాలుగా బ్యాంకులకు మిలీనియల్స్‌ రుణాలే పెద్ద వ్యాపారంగా ఉండడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మిలీనియల్స్‌లో అత్యధికులు అన్‌సెక్యూర్డ్‌ రుణాలనే తీసుకుంటుండడం బ్యాంకులకు ఆందోళన కలిగించేదేనని ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ పేర్కొంది. కొత్తగా రుణాలు తీసుకునే మిలీనియల్స్‌ సంఖ్య

ఈ ఏడాది వృద్ధి 5 శాతమే

Wednesday 13th November 2019

రెండో క్వార్టర్‌లో 4.2 శాతానికి పడిపోవచ్చు ఆర్థిక వృద్దిపై ఎస్‌బీఐ ఎకోరాప్‌ అంచనాలు న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం ఎస్‌బీఐ ఎకోరాప్‌ స్పష్టంచేసింది. వృద్ధి 6.1 శాతం మేర ఉంటుందని గతంలో వేసిన అంచనాలను సంస్థ సవరించింది. మరీ ముఖ్యంగా రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) జీడీపీ వృద్ధి 4.2 శాతానికి పడిపోవచ్చని పేర్కొనడాన్ని గమనించాలి. మొదటి

Most from this category