సింగపూర్‌లో నీరవ్ కుటుంబసభ్యుల ఖాతాల స్తంభన
By Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త నీరవ్ మోదీ కుటుంబసభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలంటూ సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మెహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 44.41 కోట్లు) ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్‌డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్ మోదీకి స్విస్ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎన్బీని నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి.
You may be interested
రీఫైనాన్స్ సదుపాయం కల్పించండి
Wednesday 3rd July 2019కేంద్రం, ఆర్బీఐకి ఎన్‌బీఎఫ్‌సీల విన్నపం ముంబై: నిధుల కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తమకు ముద్రా స్కీము కింద రీఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించాలంటూ కేంద్రాన్ని కోరాయి. అలాగే, లిక్విడిటీ అవసరాలు తీర్చేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తరహాలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేలా రిజర్వ్ బ్యాంక్‌లో ప్రత్యేక రీఫైనాన్స్ విండో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఎన్బీఎఫ్సీ సంస్థల సమాఖ్య ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్
32 డాలర్లు పెరిగి పసిడి
Wednesday 3rd July 2019అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాటు బాండ్ ఈల్డ్స్ పతనంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం ఆగస్ట్ కాంటాక్టు పసిడి ఫ్యూచర్ ఔన్స్ పసిడి ధర ఏకంగా 32డాలర్లు లాభపడి 1,439.95 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది పసిడి ధరకి వారం రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం. అమెరికా వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవర్రో ‘‘చైనాతో వాణిజ్య చర్చలు సరైన దిశలో