సిల్లీ మాంక్స్తో ఆరోస్ అవతార్ జట్టు
By Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై కేంద్రంగా ఉన్న ప్రొడక్షన్ హౌజ్ ఆరోస్ అవతార్ ఎంటర్టైన్మెంట్ తెలుగు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. కంటెంట్ ప్రొడక్షన్, మార్కెటింగ్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2013లో ప్రారంభమైన ఆరోస్ ఇప్పటివరకు మరాఠి, గుజరాతి, ఇంగ్లీషులో నాలుగు చిత్రాలను నిర్మించింది. ఇరు సంస్థలు కలిసి విభిన్న భాషల్లో చిత్రాలను రూపొందించనున్నాయి. తొలి సినిమా అశ్వమేధం త్వరలో విడుదల కానుంది. ఆరోస్తో కలిసి మరో మూడు ప్రాజెక్టులు చేపట్టామని సిల్లీ మాంక్స్ ఫౌండర్ సంజయ్ రెడ్డి తెలిపారు. ఆరోస్ ప్రతినిధులు శుభ్ మల్హోత్రా, రూపేష్ గుగాలే జైన్, సిల్లీ మాంక్స్ సీఈవో అనిల్ పల్లాలతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలుగులో దీపావళి, హిందీలో నన్హే ఐన్‌స్టీన్, మరాఠీలో దాదర్ 1992 చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు.
You may be interested
కార్డు చెల్లింపుల్లో హైదరాబాద్ ద్వితీయ స్థానం
Friday 19th July 2019రేజర్‌పే నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: డిజిటల్ యుగానికి అద్దం పడుతున్న నగరాల్లో బెంగళూరు టాప్ వన్ స్థానంలో నిలిచింది. పేమెంట్స్ సొల్యూషన్స్ సంస్థ రేజర్‌పే నిర్వహించిన తాజా సర్వేలో ఈ నగరం మోస్ట్ డిజిటలైజ్డ్ సిటీల జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది. ‘ఎరా ఆఫ్ రైజింగ్ ఫిన్‌టెక్’ పేరిట గురువారం విడుదలచేసిన సర్వేలో బెంగళూరు తరువాత వరుసగా హైదరాబాద్, ముంబై, పూణే, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర,
ప్రీమియం ఐస్ క్రీమ్స్ మార్కెట్లోకి డుమాంట్
Friday 19th July 2019ఏడాదిలో 100 ఔట్లెట్ల ఏర్పాటు కంపెనీ ఎండీ వివేక్ అయినంపూడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఐస్ క్రీమ్ మార్కెట్లోకి కొత్త బ్రాండ్ ‘డుమాంట్’ ప్రవేశించింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో 10 స్టోర్లను తెరిచిన ఈ కంపెనీ.. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో 100 ఔట్లెట్లను ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉంది. మూడ్లేళ్లలో ఈ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోనూ అడుగుపెడతామని డుమాంట్ ఎండీ వివేక్ అయినంపూడి తెలిపారు. గురువారమిక్కడ డుమాంట్ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా బ్రాండ్ డైరెక్టర్