కాఫీ డే సిద్ధార్థ మృతదేహం లభ్యం
By Sakshi

ప్రముఖ కాపీ అవుట్‌లెట్స్ ఛైన్ వ్యవస్థాపకుడు కేజీ సిద్ధార్థ మృతదేహం బుధవారం తెల్లవారుజామున నేతాృవళి నదిలో లభ్యమయ్యింది. సోమవారం సాయంత్రం అదృశ్యమైన సిద్ధార్థ ఏమయ్యారోనన్న అనుమానాలకు దీంతో తెరపడింది. వి జి సిద్ధార్థ మృతదేహాన్ని హోయిజ్ బజార్ సముద్ర తీరంలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయానికి మత్స్యకారులు గుర్తించారు. చివరిసారిగా సిద్ధార్థను చూసిన ప్రాంతం నుంచి ఈ తీరం ఒక కిలో మీటర్ దూరంలోనే ఉండడం గమనర్హం. పోస్ట్‌మార్టం నిర్వహించడానికి మృతదేహాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వెన్లాక్ ఆసుపత్రికి పంపాలని మంగళూరు పోలీసు కమిషనర్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశామని, ఫార్మాలిటీలు పూర్తయ్యాక మృతదేహాన్ని వెన్లాక్ ఆసుపత్రికి పంపామని ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని విలేకరులతో ఆయన అన్నారు. కాగా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అధికారికంగా ఇంకా గుర్తించలేదు. సిద్ధార్థ చివరిసారిగా తన డ్రైవర్ బసవరాజ్ పాటిల్‌తో కలిసి నేత్రావతి నదిపై గల వంతెన వద్ద కనిపించారు. అప్పటి నుంచి సిద్ధార్థ ఆచూకి వెతకడానికి పోలీసులు విస్తృతంగా ప్రయత్నించారు. సిద్ధార్థ తన కుటుంబానికి, డైరక్టర్ల బోర్డుకు ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులలో కొనసాగడం తనకు చాలా కష్టంగా ఉందని, తనపై ఒత్తిడి ఎక్కువగా ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు. ఇందులో ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒత్తిళ్ల గురించి, షేర్ల బై బ్యాక్ చేయాలని తన స్నేహితుడు అతనిపై తీసుకొచ్చిన ఒత్తిడి గురించి, మాజీ ఆదాయపు పన్ను అధికారి వేధింపుల గురించి ప్రస్తావించారు.
You may be interested
మైండ్‌ట్రీ డీల్ తర్వాత ఏమైంది..?
Wednesday 31st July 2019సోమవారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర గాలింపు చర్చల తరువాత ఈరోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం నదిలో లభ్యమైంది. ఆయన మృతిపై పలు సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో సిద్ధార్థ వ్యాపార లావాదేవీల వివరాలు..... కాఫీ దగ్గరే ఆగిపోకుండా సిద్ధార్థ కొంగొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఇటు ఆర్థిక సేవల నుంచి అటు ఐటీ దాకా వివిధ రంగాల్లో
ప్రమోటర్ల వాటాల తనఖాల్లో భారీ మార్పులు
Tuesday 30th July 2019వాటాలను తనఖా ఉంచి రుణాలు తీసుకుంటే ఏం జరుగుతుంది...? మార్కెట్ పతనాల్లో పెద్ద ఉపద్రవమే వచ్చి పడుతుంది. తాజా మార్కెట్ క్రాష్‌లో ఇది ఇన్వెస్టర్లతోపాటు ప్రమోటర్లకూ అవగతం అవుతూనే ఉంది. షేర్లను తనఖా ఉంచి రుణాలు తీసుకున్న వారు, హామీగా ఉంచిన షేర్ల ధరల విలువ పడిపోతుంటే... తిరిగి ఆ మేర అదనపు విలువకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే రుణమిచ్చిన సంస్థలు వాటాలను నిలువునా మార్కెట్లో విక్రయించేస్తాయి. దీంతో