News


వాహన పరిశ్రమకు మంచిరోజులు..

Tuesday 21st January 2020
news_main1579575812.png-31060

  • 2020పై ఆశావహంగా సియామ్‌

కోల్‌కతా: అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ 2020పై గంపెడాశలు పెట్టుకుంది. ఈ ఏడాది మళ్లీ పుంజుకోగలమని వాహన సంస్థల సమాఖ్య సియామ్ అంచనా వేస్తోంది. దేశీయంగా వాహనాల వినియోగం ఇప్పటికీ తక్కువగానే ఉన్న నేపథ్యంలో.. పలు విదేశీ సంస్థలు భారత్‌ మార్కెట్లో ప్రవేశించేందుకు ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలవని భావిస్తోంది. సియామ్ డిప్యుటీ డైరెక్టర్‌ సుగతో సేన్ ఈ విషయాలు వెల్లడించారు. "గడిచిన 20 ఏళ్లలో ఆటోమొబైల్ పరిశ్రమకు ఇంతటి సంక్షోభ పరిస్థితి ఎదురుకాలేదు. 2020లో పరిశ్రమ తిరిగి కోలుకోగలదని ఆశిస్తున్నాం. దేశీయంగా వాహనాల వినియోగం ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నందున.. అమ్మకాలు పెరగగలవని అంచనా వేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు క్షీణించడానికి .. కొత్త  యాక్సిల్ లోడింగ్ నిబంధనలే కారణమని సేన్ చెప్పారు. 
    మరోవైపు, ఫిబ్రవరి 7 నుంచి 12 దాకా గ్రేటర్ నోయిడాలో నిర్వహించబోయే ఆటో ఎక్స్‌పోలో గ్రేట్‌ వాల్‌, హైమా వంటి పలు కొత్త చైనీస్ ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తులను తొలిసారిగా ప్రదర్శించనున్నట్లు సేన్ వివరించారు. సియామ్‌లో సభ్యత్వం ఉన్న సంస్థలు సుమారు 70 పైగా ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు వివరించారు. దాదాపు అన్ని సంస్థలూ తమ స్టాల్స్‌లో విద్యుత్ వాహనాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.  



You may be interested

అమెజాన్‌ డెలివరీ విభాగంలోకి 10వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు

Tuesday 21st January 2020

2025 నాటికి ప్రవేశపెడతామని ప్రకటన న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ అమేజాన్‌ ఇండియా తన డెలివరీ విభాగంలో 2025 నాటికి 10వేల ఎలక్ట్రిక్‌ వాహనాలను చేర్చుకోనుంది. ప్రయోగాత్మకంగా భారత్‌లోని పలు పట్టణాల్లో 2019లో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టామని, ఇప్పుడు దేశవ్యాప్తంగా డెలివరీ నెట్‌వర్క్‌లోకి మరిన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలను చేర్చుకోనున్నట్టు అమేజాన్‌ ఇండియా సోమవారం ప్రకటించింది. మూడు చక్రాలు, నాలుగు చక్రాల వాహనాలు ఇందులో ఉంటాయని పేర్కొంది. 2020లో హైదరాబాద్‌, బెంగళూరు, నాగ్‌పూర్‌,

బడ్జెట్‌ను మించిపోయిన బిలియనీర్ల సంపద

Tuesday 21st January 2020

1 శాతం కుబేరుల వద్దే అత్యధిక ఐశ్వర్యం దేశీయంగా 70% సామాన్యులతో పోలిస్తే 4 రెట్లు అధికం ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ నివేదిక దావోస్‌:  పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ .. పూర్తి ఆర్థిక సంవత్సర

Most from this category