News


ఇన్ఫీ షేరును ఏం చేద్దాం?

Monday 14th January 2019
news_main1547442538.png-23563

గత వారం చివర్లో ఇన్ఫోసిస్‌ క్యు3 ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు మిశ్రమంగా ఉన్నా, బైబ్యాక్‌ ఆఫర్‌ కారణంగా షేరులో కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ షేరును ఎలా డీల్‌ చేయాలనే విషయమై బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..
1. క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 680. మార్జిన్‌ అంచనాలు తక్కువగా ఉన్నాయి. రెవెన్యూ వృద్ధి పాజిటివ్‌ అంశమే కానీ మార్జిన్‌ కోత కారణంగా అంచనాలు తగ్గించుకోవాల్సి వస్తోంది.
2. మోర్గాన్‌స్టాన్లీ: ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 759. ఫలితాల్లో ఆదాయం అంచనాల కన్నా బాగుంది. కానీ మార్జిన్లు మిస్‌ అయ్యాయి. రెవెన్యూ గైడెన్స్‌ పెంచడం మంచిది.
3. మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ.770. ఆదాయం అంచనాలను మించింది. ఆదాయ అంచనాలు పాజిటివ్‌గా ఉన్నాయి. బడా డీల్స్‌, పెట్టుబడులు, వేతనాల పెంపు కారణంగా మార్జిన్లలో ఇప్పటికిప్పుడు భారీ పెరుగుదల ఉండకపోవచ్చు. 
4. కోటక్‌ ఈక్విటీస్‌: రేటింగ్‌ యాడ్‌. టార్గెట్‌ రూ. 760. పెద్ద డీల్స్‌ గెలుచుకోవడం, మంచి ఆదాయం నమోదు చేయడం పాజిటివ్‌ చర్యలు. రెవెన్యూ అంచనాలను పెంచినా, ఈపీఎస్‌ అంచనాల్లో కోత విధింపు. 
5. హెచ్‌ఎస్‌బీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 880. అంచనాలను మించిన ఆదాయం, గైడెన్స్‌ అప్‌గ్రేడ్‌తో రేటింగ్‌ పెంచింది. వ్యయ ఒత్తిళ్లు కాలక్రమేణీ మేలే చేస్తాయి.
6. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 930. డిమాండ్‌ రికవరీ, వృద్ధి వేగం పొందడంతో రీరేటింగ్‌ చేసింది. ఈ త్రైమాసికంలో మార్జిన్లు తగ్గడం పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. లార్జ్‌ డీల్స్‌ బాగున్నాయి.
7. ఇన్వెస్టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 784. ఫలితాలు బాగున్నాయి. మార్జిన్లలో బలహీనత కొనసాగుతోంది. 



You may be interested

సోమవారం వార్తలోని షేర్లు

Monday 14th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితయ్యే షేర్ల వివరాల ఇన్ఫోసిస్‌:- శుక్రవారం క్యూ3 ఫలితాల సందర్భంగా కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూలో కంపెనీ ప్రతి షేరు ధర రూ.800ల చొప్పున మొత్తం 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది. ఈ ఇష్యూ విలువ సుమారు రూ.8,260 కోట్లుగా ఉంది. అలాగే  షేరు ఒక్కింటికి రూ.4లు చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించనుంది. ఇందుకు రికార్డు

నిఫ్టీకి 10730- 10650 వద్ద బలమైన మద్దతు!

Monday 14th January 2019

నిఫ్టీ గత కొన్ని వారాలుగా స్వల్ప రేంజ్‌లో ట్రేడవుతోంది. కొన్ని స్టాకులు మాత్రమే సూచీల్లో చురుగ్గా ఉంటున్నాయి. సోమవారం నిఫ్టీ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ  10800 పాయింట్ల దిగువన, సెన్సెక్స్‌ 35900 పాయింట్ల దిగువన ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 10730- 10650 పాయింట్ల జోన్‌లో బలమైన మద్దతు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిలను కాపాడుకోలేకపోతే 10300 పాయింట్లకు పతనమయ్యే ఛాన్సులున్నాయని అంచనా. పైస్థాయిలో 10870- 10940 పాయింట్ల

Most from this category