STOCKS

News


డివిడెండ్‌ టాక్స్‌ ఇన్వెస్టర్లకి మళ్లింపు?

Thursday 14th November 2019
news_main1573715900.png-29584

ఇప్పటివరకు కంపెనీలు చెల్లిస్తూ వస్తున్న డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌(డీడీటీ)లో మార్పులు తీసుకురావాలని  ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను సరళీకరణలతో విదేశీ నిధులను ఆకర్షించాలని ఇటీవలి కాలంలో ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తూ వస్తోంది. వీటిలో భాగంగా రాబోయే బడ్జెట్లో డీడీటీని డివిడెండ్‌ పొందిన వాటాదారులకు చెల్లించిన తర్వాత వసూల చేసేలా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. ఇప్పటివరకు డీడీటీని కంపెనీలే చెల్లిస్తూ వస్తున్నాయి. తాజా మార్పు విషయాన్ని ఆర్థిక శాఖ వర్గాలు అధికారికంగా నిర్ధారించలేదు. ప్రస్తుతం దేశీయ కంపెనీలు 15 శాతం డీడీటీ చెల్లిస్తున్నాయి. సర్‌చార్జితో కలిపి ఈ మొత్తం దాదాపు 20 శాతం ఉంటోంది. అటు ఇన్వెస్టరు కూడా తన ఎర్నింగ్స్‌పై పన్ను చెల్లించాల్సిఉంటుంది. ఇలా ఒకవిషయానికి బహుళ రూపాల్లో పన్నువసూలు చేయడం పట్ల అటు కంపెనీలు, ఇటు ఇన్వెస్టర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  ప్రభుత్వానికి డీడీటీ రూపంలో దాదాపు ఏటా రూ. 60వేల కోట్ల ఆదాయం వస్తోంది. తాజా మార్పుతో ప్రభుత్వాదాయానికి ఏమీ ఢోకా ఉండదని సదరు వర్గాలు చెబుతున్నాయి. కేవలం చెల్లింపుదారు మాత్రమే మారతాడని తెలిపారు. డీడీటీ ఎత్తివేయాలని చాలా రోజులుగా కంపెనీలు డిమాండ్‌ చేస్తూ ఉన్నాయి. ఇటీవల ఆర్థిక మంత్రితో సమావేశంలో కూడా కంపెనీలు ఈ విషయాన్ని లేవనెత్తాయి. అయితే ఈ పన్నును పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలేదని, దానికి బదులు కొన్ని కీలక మార్పులు చేయడానికి యత్నిస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.You may be interested

రూ.38వేల పైకి పసిడి

Thursday 14th November 2019

దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ ధర తిరిగి రూ.38వేల మార్కును అందుకుంది. అమెరికా-చైనాల మధ్య మొదటి దశ చర్చల విజయవంతంపై అనుమానం తలెత్తడంతో పాటు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 2నెలల కనిష్టానికి దిగిరావడం తదితర కారణాలు పసిడి పుంజుకునేందుకు తోడ్పాటునిచ్చాయి. ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.35.00ల లాభంతో రూ.38132.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయమార్కెట్లో పసిడి ధర మరింత ర్యాలీ చేసి

భారత్‌లోకి మరిన్ని విదేశీ ఫండ్స్‌ వచ్చేందుకు సిద్ధం!

Thursday 14th November 2019

యుఎస్‌, యురోప్‌ ఫండ్స్‌, ఇండియా మార్కెట్‌లో తమ వెయిటేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, అధిక మొత్తంలో ఎఫ్‌ఐఐలు(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) ఇండియా ఈక్విటీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, గ్లోబల్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఇండియా హెడ్‌, సునిల్‌ ఖైతాన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. మిగిలిన అంశాలు ఆయన మాటల్లో.. చెల్లింపుల రంగం ఆకర్షిస్తోంది.. విస్తృతమైన వినియోగదారుల వృద్థి, ఆ వృద్ధికి ఫైనాన్సింగ్‌ సమకూర్చగలిగే కంపెనీలకు మార్కెట్‌లో చాలా

Most from this category