News


సంశయం వద్దు... పెట్టుబడులు పెట్టు!

Wednesday 5th February 2020
news_main1580873091.png-31514

  •  పారిశ్రామిక రంగానికి ఆర్థికమంత్రి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని, ఈ విషయంలో ఎటువంటి సంశయాలకూ తావివ్వవద్దని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పారిశ్రామిక రంగానికి విజ్ఞప్తి చేశారు. 2020-21 వార్షిక బడ్జెట్‌పై సీఐఐ మంగళవారం ఇక్కడ నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో ఆమె ప్రసంగించారు. పారిశ్రామిక రంగం పురోగతికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  కేవలం ప్రభుత్వ వ్యయాలే వృద్ధికి తోడ్పాటును అందిస్తాయని తాను భావించడం లేదని తెలిపారు. పరిశ్రమ కూడా సందేహాలను వదిలి ముందుకు రావాలని,  పెట్టుబడులు పెట్టాలని కోరారు. వృద్ధికి ఇది ఎంతో అవసరమని వివరించారు. 

బ్యాంకింగ్‌ మోసాలు తగ్గాయి: అనురాగ్‌ ఠాకూర్‌
ఇదిలావుండగా,  బ్యాంకింగ్‌ రంగంలో మోసాల విలువ భారీగా తగ్గిందని ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఠాకూర్‌ తెలిపిన సమాచారం ప్రకారం- 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ మోసాల విలువ రూ.38,548 కోట్లు. 2017-18లో ఈ విలువ రూ.16,084 కోట్లకు  దిగివచ్చింది. అయితే 2018-19లో మళ్లీ ఈ విలువ రూ.18,893కు పెరిగింది. కాగా 2019-20 తొలి మూడు త్రైమాసికాలు (2019 ఏప్రిల్‌- డిసెంబర్‌) చూస్తే, బ్యాంకింగ్‌ మోసాల విలువ రూ.5,244 కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్‌ మోసాలను అరికట్టడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 



You may be interested

బిల్లు తీసుకుంటే రూ. 1 కోటి దాకా నజరానా

Wednesday 5th February 2020

జీఎస్‌టీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్లాన్‌ రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా లాటరీ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. కొన్న ప్రతీ వస్తువుకు విక్రేతల నుంచి కచ్చితంగా బిల్లు తీసుకునేలా కొనుగోలుదారులను ప్రోత్సహించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా బహుమతులు ఇచ్చేలా లాటరీని ప్రవేశపెట్టాలని

నిఫ్టీ మద్దతు 11,847 పాయింట్లు

Wednesday 5th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు మైనస్‌ మంగళవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌ లాభాల్లో ఆసియా మార్కెట్లు నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 30 పాయింట్లు క్షీణించి 11,937 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,967 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా..  కరోనా వైరస్‌

Most from this category