News


షేర్‌ఛాట్‌ పది కోట్ల డాలర్ల సమీకరణ!

Tuesday 27th August 2019
news_main1566898566.png-28052

భారత్‌లో అతిపెద్ద ప్రాంతీయ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ షేర్‌ఛాట్‌ తాజాగా పది కోట్ల డాలర్లను సమీకరించింది. సీరిస్‌ డీ ఫండ్‌ రైజింగ్‌లో భాగంగా ఈ సమీకరణ జరిపినట్లు కంపెనీ తెలిపింది. ఇంతవరకు వివిధ రూపాల్లో 22.4 కోట్ల డాలర్లను షేర్‌ఛాట్‌ సేకరించింది. తాజా సమీకరణలో ఇప్పటికే కంపెనీ భాగస్వాములైన షున్‌వై క్యాపిటల్‌, లైట్‌స్పీడ్‌ వెంచర్‌ పార్టనర్స్‌, సైఫ్‌ క్యాపిటల్‌, ఇండియా కోయిషెంట్‌, మార్నింగ్‌సైడ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ పాల్గొన్నాయి. ఈ ఫండింగ్‌లో కొత్తగా ట్విటర్‌, ట్రస్ట్‌బ్రిడ్జ్‌ పార్టనర్స్‌ సంస్థలు కూడా పాల్గొన్నాయి.

ఈ నిధులు టెక్నికల్‌ ఇన్‌ఫ్రా బలోపేతం చేసుకునేందుకు, వ్యాపారాభివృద్ధికి వినియోగిస్తామని షేర్‌ఛాట్‌ తెలిపింది. కంపెనీ భాగస్వాముల మధ్య మేథోబదిలీ వేగవంతం చేసే యత్నాలు కూడా చేస్తామని తెలిపింది. దేశంలో మరింత విస్తరించే క్రమంలో అన్ని రకాల డివైజ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ సైట్‌ నడిచేలా కొత్త ఫీచర్లు ప్రవేశ పెడతామని వివరించింది.

కొత్త ఫండింగ్‌తో తమ వృద్ధి బాటలో మరో ముందడుగు పడింది- షేర్‌ఛాట్‌ సీఈఓ అనుష్క్‌ సచ్‌దేవా.

షేర్‌ఛాట్‌తో భాగస్వామ్యం సంతోషకరం- ట్విటర్‌ ఇండియా ఎండీ మహేశ్వరి. 



You may be interested

మూడోరోజూ లాభాల ముగింపు

Tuesday 27th August 2019

11100 పైన ముగిసిన నిఫ్టీ 147 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  మార్కెట్‌ వరసగా మూడోరోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 37641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11105 వద్ద ముగిసింది. వాణిజ్య వివాద పరిష్కారానికి త్వరలో చైనాతో చర్చలు ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ ప్రకటించడం, గత వారాంతంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు, అదనపు నిధులను ప్రభుత్వానికి

కొనడానికి తొందరొద్దు!

Tuesday 27th August 2019

ప్రస్తుత ర్యాలీ స్వల్పకాలికమే ముందుంది మరింత పతనం దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకోండి దీపక్‌ షెనాయ్‌   ‘ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యలలో పెద్ద ఆర్థిక ఉద్దీపనలు లేవు. కానీ ఇలాంటి చర్యలు, ప్రభుత్వం మనల్ని పట్టించుకుంటోంది అనే పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరగడానికి ఉపయోగపడతాయి’ అని క్యాపిటల్‌ మైండ్ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... ఉద్దీపనలు లేవు... గత వారం ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యలు..ఆర్థిక

Most from this category