News


ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలి

Wednesday 5th June 2019
news_main1559728938.png-26108

  • ఆర్‌బీఐతో అంతర్గత విచారణ జరపాలి
  • ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కుంభకోణంపై ఎస్‌ఎఫ్‌ఐవో సూచన
  • నష్టాల రికవరీకి చర్యలపై ప్రణాళిక

న్యూఢిల్లీ: దాదాపు రూ. 90,000 కోట్ల రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో తీవ్ర నేరాల విచారణ సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు వేగవంతం చేసింది. మోసాల్లో పాలుపంచుకున్న ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, లోపాలను గుర్తించడంలో జాప్యానికి గల కారణాలను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ అంతర్గతంగా విచారణ జరపాలని సూచించింది. ఉన్నతాధికారులు కుమ్మక్కై పాల్పడిన మోసం కారణంగా వాటిల్లిన నష్టాలను రాబట్టేందుకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఫిన్‌) కొత్త మేనేజ్‌మెంట్ తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎస్‌ఎఫ్‌ఐవో పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్ సంస్థ అయిన ఐఫిన్‌ వ్యవహారంపై విస్తృతంగా దర్యాప్తు చేసిన అనంతరం ఎస్‌ఎఫ్‌ఐవో గత శుక్రవారం తొలి చార్జి షీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఆర్థిక కుంభకోణం వెనుక తొమ్మిది మంది కోటరీ ఉన్నట్లు అందులో పేర్కొంది. కంపెనీని ఇష్టారాజ్యంగా నడిపిస్తూ కొందరు స్వతంత్ర డైరెక్టర్లు, ఆడిటర్లు కుమ్మక్కై ఈ కుంభకోణానికి వ్యూహ రచన చేసినట్లు ఆరోపణలు చేసింది. హరి శంకరన్‌, రవి పార్థసారథి, అరుణ్ సాహా, రమేష్ బవా, విభవ్ కపూర్‌, కే రామ్‌చంద్ తదితరలు ఈ కోటరీలో ఉన్నట్లు పేర్కొంది.
రుణాలు, నికరంగా చేతిలో ఉన్న నిధుల లెక్కింపులో ఐఫిన్ అవకతవకలకు పాల్పడుతోందంటూ 2015 నుంచి ఆర్‌బీఐ అనేక నివేదికల్లో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐవో ప్రస్తావించింది. అయినప్పటికీ ఐఫిన్‌పై జరిమానాలేమీ విధించలేదని, దిద్దుబాటు చర్యలేమీ లేకుండా ఆ సంస్థ యథాప్రకారం కార్యకలాపాలను కొనసాగించగలిగిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జరిమానాల విధింపులో జాప్యానికి గల కారణాలను వెలికితీసేందుకు అంతర్గతంగా విచారణ జరపాలని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి ఎస్‌ఎఫ్‌ఐవో తెలిపింది. 



You may be interested

మరింతగా అప్పుల ‘చమురు’!

Wednesday 5th June 2019

భారీ రుణ భారంలో చమురు మార్కెటింగ్‌ సంస్థలు మార్చినాటికి ఏకంగా రూ.1.62 లక్షల కోట్ల రుణాలు భారీ మూలధన వ్యయాలతో పెరిగిన రుణాలు ప్రభుత్వం సబ్సిడీలు చెల్లించకపోవటంతో ఇంకాస్త... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) రుణాలపై ఆధారపడడం రానురాను మరింత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌నే (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ఉమ్మడి రుణాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడింటి

టెక్నో పెయింట్స్‌ మరో తయారీ కేంద్రం

Wednesday 5th June 2019

రూ.2.5 కోట్లతో ఆర్‌అండ్‌డీ సెంటర్‌ కూడా.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో; 10న ఆరంభం త్వరలో మార్కెట్లోకి గ్రానైట్, మార్బుల్‌ పెయింట్స్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ రంగంలోని హైదరాబాదీ కంపెనీ ఫార్చూన్‌ పెయింట్స్‌ (టెక్నో పెయింట్స్‌) మరో తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. రూ.2.5 కోట్ల పెట్టుబడితో ప్లాంట్, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫార్చూన్‌ గ్రూప్‌ ఎండీ ఆకూరి శ్రీనివాస రెడ్డి చెప్పారు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఈ

Most from this category