News


సెన్సెక్స్‌ కీలకస్థాయి 34,130 పాయింట్లు

Monday 16th March 2020
news_main1584328623.png-32491

కరోనావైరస్‌ వివిధ దేశాలకు శరవేగంగా వ్యాప్తిచెందడం, పలు దేశాలు, కంపెనీలు ట్రావెల్‌ బ్యాన్స్‌ ప్రకటించడం, ఎన్నో కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను అమలుచేయడం వంటి పలు కారణాలతో ప్రపంచ ఈక్విటీ  మార్కెట్లో 2008 ఆర్థిక సంక్షోభ అనంతరం అతిపెద్ద పతనం సంభవించింది. ఆయా కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి తక్కువ వడ్డీరేట్లతో పుష్కలంగా విడుదల చేస్తున్న నిధులు కూడా మార్కెట్లను  శాంతింపచేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కమిటీ సమీక్ష సందర్భంగా 0.75-1 శాతం వరకూ వడ్డీ రేట్ల కోత వుండవచ్చన్న అంచనాలు  మొదలవడంతో గత శుక్రవారం మార్కెట్‌ పతనాలకి బ్రేక్‌పడింది. అయితే ఈ వారం కూడా ఫెడ్‌ కంటే కరోనావైరస్‌ ప్రభావిత వార్తలే మార్కెట్‌ను నడిపించవచ్చు. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు  ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
మార్చి13తో ముగిసినవారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన 37,000 పాయింట్ల దిగువకు పడిపోయినంతనే అనూహ్యపతనాన్ని చవిచూసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29,388 పాయింట్ల వద్ద  కనిష్టస్థాయిని తాకింది. అటుతర్వాత కాస్త కోలుకుని 34.103 పాయింట్ల వద్ద ముగిసింది.  అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 3,474 పాయింట్ల భారీనష్టాన్ని చవిచూసింది. ఈ వారం కూడా సూచీ  భారీగా కదలికల్ని కనపర్చే అవకాశం వుంది. ఈ సందర్భంలో.... జనవరి 20 నాటి రికార్డు గరిష్టస్థాయి అయిన 42,273 పాయింట్ల నుంచి గతవారపు 29,388 పాయింట్ల వరకూ జరిగిన  12,885 పాయింట్ల పతనంలో 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 34,310 పాయింట్ల స్థాయి సెన్సెక్స్‌కు కీలకమైనది. ఈ స్థాయిపైన రిలీఫ్‌ర్యాలీ జరిగే అవకాశాలు...ఈ స్థాయి  దిగువన మళ్లీ పతనబాట పట్టే ప్రమాదమూ వుంటుంది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే 34,770-35,260 శ్రేణిని తొలుత అందుకోవొచ్చు. అటుపైన వేగంగా 36,020 పాయింట్ల స్థాయికి చేరవచ్చు.  ఆపై గరిష్టంగా 36,950-37,350 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. పైన ప్రస్తావించిన కీలకస్థాయి దిగువన సెన్సెక్స్‌ వేగంగా 32,490 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే  31,220 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే తిరిగి 29,400 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.   

 నిఫ్టీ కీలకస్థాయి 10,030

క్రితంవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,550 పాయింట్ల వరకూ హఠాత్‌ పతనాన్ని చవిచూసి, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,034 పాయింట్ల భారీ నష్టంతో 9,955 పాయింట్ల వద్ద ముగిసింది.  సెన్సెక్స్‌లానే నిఫ్టీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 10,030 పాయింట్ల స్థాయి ఈ వారం కీలకమైనది. ఈ వారం... ఈ స్థాయి ఎగువన తొలుత  వేగంగా 10,160-10,335 పాయింట్ల  శ్రేణిని చేరవచ్చు, ఈ శ్రేణిని సైతం అధిగమిస్తే 10,545 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ముగిస్తే కొద్ది రోజుల్లో 10,750-10,950 పాయింట్ల శ్రేణి వరకూ రిలీఫ్‌ ర్యాలీ కొనసాగే ఛాన్స్‌  వుంటుంది. ఈ వారం 10,030 పాయింట్లపైన నిఫ్టీ నిలదొక్కుకోలేకపోతే 9,500 పాయింట్ల వద్ద తొలుత మద్దతు పొందవచ్చు. ఈ లోపున 9,100 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 8,555  పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.  You may be interested

'యస్‌'పై 18న మారటోరియం ఎత్తివేత

Monday 16th March 2020

అమల్లోకి వచ్చిన పునరుద్ధరణ ప్రణాళిక నెలాఖరుకు కొత్త బోర్డు ఏర్పాటు సీఈవో, ఎండీగా ప్రశాంత్ కుమార్‌ న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్‌ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్‌వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్

ఒడిదుడుకుల వారం!

Monday 16th March 2020

కోవిడ్–19 వైరస్ పరిణామాలే కీలకం.. భారీ ఆటుపోట్లకు అవకాశం సోమవారం ఫిబ్రవరి డబ్ల్యూపీఐ ద్రవ్యొల్బణం వెల్లడి ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కీలక పరిణామాలే ఈ వారంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్‌ను నడిపించనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్‌ విస్తృతి ఆధారంగా సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే

Most from this category