News


వృద్ధులకు బ్యాంకు వడ్డీపై టీడీఎస్‌ మినహాయింపు

Friday 24th May 2019
news_main1558681038.png-25906

రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారికి అమల్లోకి  న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్‌ మినహాయింపు విషయంలో వృద్ధులకు సంతోషాన్నిచ్చే నిర్ణయం వెలువడింది. ఇకపై రూ.5 లక్షల వరకు పన్ను ఆదాయం కలిగిన వృద్ధులు బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్‌) నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికే ఈ అవకాశం ఉంది. 2019-20 మధ్యంత బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను రాయితీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం గమనార్హం. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఫామ్‌ 15హెచ్‌ను సవరిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 87ఏ కింద అన్ని రకాల రాయితీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర ఆదాయం పన్ను పరిధిలో లేని వారి నుంచి ఫామ్‌15 హెచ్‌ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్వీకరించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షల ఉన్న వారు తమ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ నుంచి టీడీఎస్‌ కోయకుండా, ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఫామ్‌15 హెచ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 



You may be interested

ఎన్‌డీఏ 2.0 కోసం స్టాక్‌ రికమండేషన్లు

Friday 24th May 2019

ఎన్‌డీఏ కూటమి రెండో దఫా ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని దేశీయ మార్కెట్లు, బ్రోకరేజ్‌లు స్వాగతించాయి. గతంలో చేపట్టిన సంస్కరణలు ఎలాంటి విఘాతం లేకుండా కొనసాగుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గతంతో పోలిస్తే బీజేపీ సొంతంగా ఈ దఫా మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఎన్‌డీఏ తొలి దశ ఐదేళ్లలో సూచీలు ఏడాదికి సుమారు 11 శాతం చొప్పున రాబడులు ఇచ్చాయి. ఈ సారి మరింత ఎక్కువ రాబడులుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారానికి అనిల్‌ గుడ్‌బై

Friday 24th May 2019

 ఆర్‌నామ్‌ చేతికి నిప్పన్‌లైఫ్‌ రిలయన్స్‌ క్యాపిటల్‌ వాటా విక్రయం ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు పబ్లిక్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌  ఒక్కో షేరుకు రూ.230 ఆఫర్‌ న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో (ఆర్‌నామ్‌) రిలయన్స్‌ క్యాపిటల్‌, జపాన్‌కు చెందిన నిప్పన్‌లైఫ్‌కు చెరో 42.88 శాతం వాటా ఉంది. ఆర్‌నామ్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌ తనకున్న వాటాను నిప్పన్‌కు విక్రయించేందుకు తప్పనిసరిగా

Most from this category