News


సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌కు పన్ను మినహాయింపు..

Wednesday 25th September 2019
news_main1569385785.png-28531

-ఇవ్వాలని ప్రభుత్వానికి ఎస్‌బీఐ ఎకోరాప్‌ సూచన
-ద్రవ్యలోటుపై ప్రభావం పరిమితమేనని అభిప్రాయం

న్యూఢిల్లీ: పెద్దల పొదుపు పథకం (సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌) కింద ఆర్జించే వడ్డీ రాబడిపై ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక సూచించింది. దీనివల్ల ద్రవ్యలోటుపై ప్రభావం పరిమితమేనని పేర్కొంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) కింద ఒకరు రూ.15 లక్షలను గరిష్టంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. కాకపోతే 60 ఏళ్లు, ఆ పైన వయసున్న వారికే ఇందుకు అనుమతి ఉంటుంది. దీనిపై 8.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతీ త్రైమాసికానికి ఓసారి వడ్డీ చెల్లింపు ఉంటుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు, ఆ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ఇందులో పెట్టుబడికి రూ.1.50 లక్షల వరకు సెక్షన్‌ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. అయితే, ఈ పథకంలో డిపాజిట్‌పై వచ్చే వడ్డీకి ఆదాయపన్ను మినహాయింపు ప్రస్తుతం లేదు. ఇది ఈ పథకానికి ఉన్న ఒక ప్రతికూలత. ‘‘ఈ పథకంలో పెట్టుబడులపై వచ్చే రాబడికి పూర్తి పన్ను రాయితీ ఇవ్వడం మంచిది. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయం కేవలం రూ.3,092 కోట్లు మాత్రమే. ప్రభుత్వ ద్రవ్యలోటుపై ఇది 2 బేసిస్‌ పాయింటు మాత్రమే’’ అని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని బ్యాంకులు ఆర్‌బీఐ రేట్ల కోతతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడాన్ని చూస్తూనే ఉన్నాం. అటు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోని ఇతర పథకాలపై వడ్డీ రేటుతో చూసుకున్నా కానీ, ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకంలో వడ్డీ రేటు పెద్దలకు సంబంధించి ఆకర్షణీయమైనదిగా ఉంది.
4.1 కోట్ల ఖాతాలు.. 
‘‘సుమారు 4.1 కోట్ల సీనియర్‌ సిటిజన్‌ టర్మ్‌ డిపాజిట్‌ ఖాతాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటిల్లోని మొత్తం డిపాజిట్లు రూ.14 లక్షల కోట్లు. దేశ జీడీపీలో 7 శాతానికి సమానం. ఇందులో సగటున ఓ డిపాజిట్‌ మొత్తం రూ.3.3 లక్షలుగా ఉంటుంది. వీటిపై వడ్డీ రాబడి ప్రైవేటు తుది వినియోగ వ్యయం 2018-19లో 5.5 శాతమే. తగ్గుతున్న వడ్డీ రేట్ల పరిస్థితుల్లో ఇది ఇంకా తగ్గుతుంది. దీంతో ప్రైవేటు తుది వినియోగంపై ప్రభావం చూపిస్తుంది’’ అని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక పేర్కొంది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 390 పాయింట్లు డౌన్‌

Wednesday 25th September 2019

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో భారీ ర్యాలీ చేసిన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌​ బుధవారం ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 10.04 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 398.35 పాయింట్లు కోల్పోయి 29771.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.36 శాతం నష్టపోయి రూ. 1236.80 వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.16 శాతం నష్టపోయి రూ. 435.80 వద్ద ట్రేడవుతుండగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌

సామ్‌సంగ్‌ ‘ఫోల్డ్‌’ వస్తోంది!

Wednesday 25th September 2019

-అక్టోబరు 1న భారత మార్కెట్‌కు -ధర సుమారు రూ.1.50 లక్షలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచంలో తొలిసారిగా ఫోల్డబుల్‌ మొబైల్‌ డివైస్‌ను ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ అభివృద్ధి చేసింది. గెలాక్సీ ఫోల్డ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్‌గానూ, ట్యాబ్లెట్‌ పీసీగానూ వినియోగించుకునే వీలుగా ఈ ఉపకరణాన్ని తయారు చేసింది. మొత్తం ఆరు కెమెరాలు పొందుపరిచారు. 7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లేతో రూపొందింది. ముందువైపు 10 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, 8 ఎంపీ ఆర్‌జీబీ డెప్త్‌ కెమెరా,

Most from this category