News


సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్స్‌’

Thursday 13th February 2020
news_main1581568955.png-31750

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్‌ రిటైల్‌ కంపెనీ సెలెక్ట్‌ మొబైల్స్‌ గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ సీఎండీ వై గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్‌ మొబైల్‌ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభ్యమవుతాయని పేర్కొన్నారు. రూ.25,500 విలువ చేసే శాంసంగ్‌ ఏ6 కేవలం రూ.8,999లకు, రూ.8,999 విలువ చేసే 4జీ మొబైల్‌ రూ.3,999లకు, రూ.6,999 విలువ చేసే స్మార్ట్‌ఫోన్‌ రూ.3,999లకు వంటి రకరకాల ఆఫర్లున్నాయని తెలిపారు. You may be interested

నిఫ్టీ 12వేల దిగువకు రాదు!

Thursday 13th February 2020

ఎఫ్‌అండ్‌ఓ అనలిస్టుల అంచనా నిఫ్టీ ఈ సీరిస్‌లో 12వేల దిగువకు రాకపోవచ్చని ఎఫ్‌అండ్‌ఓ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అందువల్ల కొంచెం రిస్కు తీసుకోగల ఇన్వెస్టర్లు ఈ నెల అవుట్‌ ఆఫ్‌ ద మనీ(ఓటీఎం) నిఫ్టీపుట్స్‌ను విక్రయించవచ్చని సూచిస్తున్నారు. పుట్‌ కాల్‌ నిష్పత్తి(పీసీఆర్‌) పెరుగుతుండడం, ఆప్షన్‌ ఐవీలో క్షీణత పరిశీలిస్తే నిఫ్టీ పుట్‌ విక్రయం మంచి లాభాలనిస్తుందని అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ సాధ్యమైతే అప్‌మూవ్‌ చూపడం లేదా స్తబ్దుగా ఉండడమే జరుగుతుందని, 12000 పాయింట్ల

ఐఆర్‌సీటీసీ లాభం మూడు రెట్లు అప్‌

Thursday 13th February 2020

ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.74 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 180 శాతం ఎగసి రూ.206 కోట్లకు పెరిగిందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. అన్ని విభాగాలు మంచి వృద్ధి సాధించడంతో నికర లాభం

Most from this category