News


ఏ రంగాలకు సానుకూలం..?

Friday 5th July 2019
news_main1562350553.png-26833

బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎన్నో నిర్ణయలు, చర్యలను ప్రకటించారు. కొన్ని రంగాలకు ప్రయోజనం కల్పించే సానుకూల చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్లు అయితే ప్రతికూలంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో ఏ రంగంపై ప్రభావం ఏ మేరకు ఉంటుందో నిపుణుల అభిప్రాయాల విశ్లేషణ చూద్దాం...

 

సానుకూలం 
మౌలికరంగం: 100 లక్షల కోట్ల రూపాయలను వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో ఇన్వెస్ట్‌ చేసే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. మౌలిక రంగంలో బాండ్‌ మార్కెట్‌ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రతిపాదన కూడా చేశారు. రోడ్డు, ఇన్‌ఫ్రా సెస్సు పేరిట ప్రతీ లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ప్రతిపాదనను మంత్రి ప్రకటించారు. దీనివల్ల మౌలిక రంగానికి ఎన్నో నిధులు అందుబాటులోకి వస్తాయి. 
రైల్వే: 2018-2030 మధ్య కాలంలో రైల్వే రంగంపై రూ.50 లక్షల కోట్లను ప్రభుత్వం వ్యయం చేయనుంది. ఏటా రూ.4 లక్షల కోట్ల మేర రైల్వే సదుపాయాల కల్పనకు కావాలి. 
రోడ్లు: రానున్న ఐదేళ్లలో 1.25 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.80,250 కోట్లు వ్యయం చేయనుంది. 
విద్యుత్‌ వాహనాలు: ఫేమ్‌-2 కింద సబ్సిడీని ప్రభుత్వం ఇప్పటికే అమల్లోకి తీసుకురాగా, విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు తీసుకున్న రుణాలపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ రూ.1.5 లక్షలకు పన్ను రాయితీని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
విద్యుత్‌: విద్యుత్‌కు జాతీయ గ్రిడ్‌ ఏర్పాటు ప్రతిపాదన. పాతబడిన, సమర్థవంతంగా లేని విద్యుత్‌ ప్లాంట్ల మూసివేతపై అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటును ప్రతిపాదించారు. అలాగే, గ్యాస్‌ ఆధారిత విత్యుత్‌ ప్లాంట్లలో తక్కువ సామర్థ్య వినియోగ సమస్యను కూడా ఈ కమిటీ పరిష్కరించనుంది. 
ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీ: ఆర్థికంగా బలమైన ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అధిక రేటింగ్‌ ఆస్తులను ప్రభుత్వరంగ బ్యాంకులు కొనుగోలు చేసేందుకు వీలుగా, రూ.లక్ష కోట్ల పాక్షిక గ్యారంటీ(ఆరె నెలలు)ని ప్రభుత్వం అందించనుంది. దీంతో టాప్‌ రేటింగ్‌ ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత నిధుల వెసులుబాటు లభించనుంది. 
అందుబాటు ధరల ఇళ్లు: ప్రస్తుతం ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను రాయితీ ఉండగా, అదనంగా మరో రూ.1.50 లక్షల వడ్డీపైనా రాయితీ లభించనుంది. అంటే మొత్తం రూ.3.5 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.45 లక్షల వరకు విలువ కలిగిన ఇళ్ల రుణాలకే ఇది వర్తిస్తుంది. 
బీమారంగం: బీమా మధ్యవర్తిత్వ సంస్థల్లో నూరు శాతం ఎఫ్‌డీఐల ప్రతిపాదన. దీంతో బీమా ఉత్పత్తుల విస్తరణ మరింత పెరుగుతుందని అంచనా. 
రిటైల్‌: సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో స్థానికంగానే ఉత్పత్తుల సమీకరణ నిబంధనలు సడలింపు. 
పీఎస్‌యూ బ్యాంకులు: 2019-20లో రూ.70,000 కోట్ల నిధుల సాయం. 
సిగరెట్లు: సిగరెట్లపై ఎక్సైజ్‌ డ్యూటీని పరిమిత స్థాయిలో మంత్రి ప్రతిపాదించగా, అనుకున్న దాని కంటే ఇది తక్కువగా ఉండడం సిగరెట్‌ కంపెనీలకు సానుకూలం. 

 

ప్రతికూలం
జెమ్స్‌, జ్యుయలరీ: బంగారం దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. బంగారం దిగుమతులు తగ్గించి, డిజిటల్‌ గోల్డ్‌ అయిన ఈటీఎఫ్‌, బంగారం బాండ్లను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. బంగారం ధరలు ఇ‍ప్పటికే ఎన్నో ఏళ్ల గరిష్ట స్థాయిలకు చేరడంతో సమీప కాలంలో బంగారానికి డిమాండ్‌ తగ్గుతుందని అంచనా. 
ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు: ప్రతీ లీటర్‌, డీజిల్‌పై ఒక్కో రూపాయి అదనపు ఎక్సైజ్‌ సుంకం, ఒక్కో రూపాయి ఇన్‌ఫ్రా సెస్సు అన్నది అధిక ధరలకు దారితీస్తుంది. ఇది వినియోగదారులపై భారం మోపుతుంది.
ఫర్టిలైజర్స్‌, ఆగ్రోకెమికల్స్‌: సాగు రంగానికి జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌ ప్రతిపాదన. అంటే రుణాలపై రైతులు ఆధారపడకుండా చర్యలు తీసుకోవడం. తద్వారా ఉత్పత్తుల ధరలు తగ్గించి, రుణ ఊబిలోకి పోకుండా చూడడం. 
ఆటోమొబైల్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతుంది. దాంతో ఇప్పటికే అమ్మకాలు తగ్గిన ఆటోమొబైల్‌ కంపెనీలపై ప్రభావం ఎక్కువే ఉంటుంది. You may be interested

ఆర్‌బీఐ నుంచి రూ.90,000 కోట్ల డివిడెండ్‌

Saturday 6th July 2019

వచ్చే నెలలో కేంద్రానికి  న్యూఢిల్లీ: ఆర్‌బీఐ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల డివిడెండ్‌ లభించవచ్చని అంచనా వేస్తున్నామని ఆర్థిక కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ చెల్లించిన డివిడెండ్‌, రూ.68,000 కోట్లుతో పోల్చితే ఇది 32 శాతం అధికమని వివరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ చెల్లించిన అత్యధిక డివిడెండ్‌ ఇప్పటిదాకా ఇదేనని తెలిపారు. ఆర్‌బీఐ సాధారణంగా జూలై-జూన్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా

ఇక ముందు వాటాదారులకు మరిన్ని డివిడెండ్లు 

Friday 5th July 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిస్టెడ్‌ కంపెనీలకు రుచించని నిర్ణయాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. అది షేర్ల బైబ్యాక్‌ (వాటాదారుల నుంచి కంపెనీలు షేర్లను తిరిగి కొనుగోలు చేయడం)పై 20 శాతం పన్ను విధింపు. 2007లో ప్రభుత్వం వాటాదారులకు కంపెనీలు చేసే డివిడెండ్‌ చెల్లింపులపై 10 శాతం పన్నును తీసుకొచ్చింది. ఆ తర్వాత దీన్ని 15 శాతానికి పెంచగా, అన్ని రకాల పన్నులు కలిపి ప్రస్తుతం 20 శాతంగా అమల్లో ఉంది.

Most from this category