News


యూపీఐ ద్వారానే ఐపీవోల్లో పెట్టుబడులు

Saturday 27th July 2019
news_main1564206428.png-27357

  • - సెబీ సర్క్యులర్‌

న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్‌ (ఐపీవో)లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారానే చెల్లింపులు జరపాల్సి ఉంటుందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. రెండో విడత యూపీఐ చెల్లింపుల విధానాన్ని జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చినట్లు ఒక సర్క్యులర్‌లో తెలిపింది. యూపీఐ విధానంలో ఐపీవోలకు దరఖాస్తు చేసుకునేందుకు 45 బ్యాంకుల జాబితాను కూడా వెల్లడించింది. సెల్ఫ్ సర్టిఫైడ్ బ్యాంకుల (ఎస్‌సీఎస్‌బీ) లిస్టు, మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఎస్‌సీఎస్‌బీల జాబితాలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మొదలైన బ్యాంకులు ఉన్నాయి. యూపీఐ ద్వారా ఐపీవోకి దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లు.. సెబీ నిర్దేశించిన ఎస్‌సీఎస్‌బీల జాబితాలో తమ బ్యాంకు కూడా ఉందో లేదో చూసుకోవాలి. సరైన యూపీఐ హ్యాండిల్‌ లేదా ఎస్‌సీఎస్‌బీల జాబితాలో లేని బ్యాంకుల ద్వారా చేసే దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని సెబీ వివరించింది. యూపీఐ విధానంలో లేని బ్యాంకుల ఖాతాదారులు ఎస్‌సీఎస్‌బీకి అప్లికేషన్ ఫారం సమర్పించడం లేదా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, డీమ్యాట్, బ్యాంక్ అకౌంట్ల ద్వారా గానీ ఐపీవోకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. తాజాగా యూపీఐ విధానం అందుబాటులోకి రావడంతో మధ్యవర్తిత్వ సంస్థకు అప్లికేషన్ ఫారంలు సమర్పించడం ద్వారా ఐపీవోకి దరఖాస్తు చేసుకునే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సెబీ తెలిపింది. పాత పద్ధతిలో మధ్యవర్తిత్వ సంస్థ తమకు అందిన దరఖాస్తులను ఎస్‌సీఎస్‌బీ లేదా బ్యాంకులకు పంపించిన తర్వాత నిధులను బ్లాక్ చేయడం జరిగేది. అయితే, లిస్టింగ్‌ వ్యవధిని ఆరు రోజుల నుంచి మూడు రోజులకు కుదించే దిశగా ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేసేందుకు జనవరి 1 నుంచి యూపీఐని ప్రత్యామ్నాయ చెల్లింపు విధానంగా సెబీ దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. 



You may be interested

టాప్‌ కంపెనీల క్యూ1 ఫలితాల విశ్లేషణ

Saturday 27th July 2019

త్రైమాసిక ఫలితాల సీజన్‌లో ఉన్నాం. కొన్ని కంపెనీల ఫలితాలు మార్కెట్లను ఆశ్చర్య పరచగా, మరికొన్ని నిరాశపరిచాయి. ఇప్పటి వరకు వెలువడిన టాప్‌ కంపెనీల ఫలితాలు...  హిందూస్తాన్ యూనిలీవర్: మెరుగైన వాల్యూమ్ వృద్ధి, క్యూ 1లో 14.8 శాతం పెరిగిన లాభం.  ఎఫ్‌ఎంసిజి సెక్టార్‌లో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) మెరుగైన వాల్యూమ్ వృద్ధిని నమోదుచేసింది. ఫలితంగా తన స్టాండ్‌ఎలోన్‌ లాభం 14.8 శాతం పెరిగి రూ.1,755 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలానికి ఈ లాభం

యాక్సిస్‌ నుంచి మనీ మార్కెట్‌ ఫండ్‌

Saturday 27th July 2019

ముంబై: యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘యాక్సిస్‌ మనీ మార్కెట్‌ ఫండ్‌’ను ఆవిష్కరించింది. ఇన్వెస్టర్ల స్వల్ప కాల అవసరాల కోసం ఉద్దేశించిన నిధులను సమర్థవంతంగా ఈ పథకం కింద నిర్వహిస్తామని సంస్థ తెలిపింది. ఇది ఓపెన్‌ఎండెడ్‌ పథకం. పెట్టుబడులను మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. నూరు శాతం పెట్టుబడులను ఏఏఏ రేటింగ్‌ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ పథకం శుక్రవారం ఆరంభం కాగా, ఆగస్ట్‌ 1 వరకు సబ్‌స్క్రిప్షన్‌

Most from this category