STOCKS

News


డిఫాల్ట్‌ నిబంధనలు మరింత కఠినం

Thursday 21st November 2019
news_main1574308177.png-29746

  • రైట్స్‌ ఇష్యూ కాలం కుదింపు 
  • పీఎమ్‌ఎస్‌ కనీస పెట్టుబడి పెంపు 
  • సెబీ బోర్డ్‌ నిర్ణయాలు

ముంబై: రుణ చెల్లింపుల్లో విఫలానికి సంబంధించిన వెల్లడి నిబంధనలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కఠినతరం చేసింది. రైట్స్‌ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని 55 రోజుల నుంచి 31 రోజులకు కుదించింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌  స్కీమ్‌(పీఎమ్‌ఎస్‌)కు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. ఈ మేరకు సెబీ బోర్డ్‌ బుధవారం తీసుకున్న నిర్ణయాల వివరాలను సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు. వివరాలు....

డిఫాల్ట్‌ 30 రోజులకు మించితే...
స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ఏదైనా కంపెనీ రుణ చెల్లింపుల్లో విఫలమై 30 రోజులు దాటితే, 24 గంటల్లోనే ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు వెల్లడించాల్సి ఉంటుంది. రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలకు సంబంధించిన సమాచారం వాటాదారులకు, ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవడం కోసమే సెబీ   ఈ నిబంధనను తెచ్చింది. ఈ కొత్త వెల్లడి నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. 

రైట్స్‌ ఇష్యూ కాలం 31 రోజులకు కుదింపు...
రైట్స్‌ ఇష్యూకు సంబంధించిన ప్రక్రియ కాలాన్ని సెబీ తగ్గించింది. రైట్స్‌ ఇష్యూ ప్రక్రియ మొత్తం గతంలో 55 రోజుల్లో పూర్తయ్యేది. దీనిని 31 రోజులకు తగ్గించింది. అంతే కాకుండా రైట్స్‌ ఇష్యూకు దరఖాస్తు చేసే అన్ని కేటగిరీల ఇన్వెస్టర్లు ఆస్బా (అప్లికేషన్స్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్‌డ్‌ అమౌంట్‌)విధానంలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. కాగితం రూపంలో షేర్లున్న ఇన్వెస్టర్లు రైట్స్‌ ఇష్యూ షేర్లు పొందాలంటే డీమ్యాట్‌ అకౌంట్‌ తప్పనిసరిగా ఉండాలి. 

పీఎమ్‌ఎస్‌ కనీస పెట్టుబడి పెంపు...
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ స్కీమ్‌(పీఎమ్‌ఎస్‌) నుంచి రిటైల్‌ ఇన్వెస్టర్లను దూరం చేయడమే లక్ష్యంగా పీఎమ్‌ఎస్‌ కనీస పెట్టుబడి పరిమితిని సెబీ పెంచింది. గతంలో రూ.25 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.50 లక్షలకు పెంచింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజర్ల నెట్‌వర్త్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఈ నెట్‌వర్త్‌ను చేరుకోవడానికి పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు మూడేళ్ల గడువును ఇచ్చింది. ఈ తాజా నిబంధనల కారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెరుగుతాయని నిపుణుల అంచనా. 

వ్యాపార బాధ్యత నివేదిక...
స్టాక్‌ మార్కెట్లో లిస్టైన టాప్‌ 1,000 కంపెనీలు వార్షిక వ్యాపార బాధ్యత నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. వాటాదారులతో సంబంధాలు, పర్యావరణ సంబంధిత అంశాలతో కూడిన ఈ నివేదికను ఈ కంపెనీలు తప్పనిసరిగా సెబీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాప్‌ 500 కంపెనీలకే వర్తించే ఈ నిబంధన ఇప్పుడు టాప్‌ 1000 కంపెనీలకు వర్తించనున్నది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నిబంధనల పటిష్టమైన అమలు నిమిత్తం సెబీ ఈ చర్య తీసుకుంది.  You may be interested

డిజిటల్ లావాదేవీలు 2,178 కోట్లు

Thursday 21st November 2019

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ 13 నాటికి 2,178 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్‌ వెల్లడించారు. 2018-19 ఏడాదిలో ఈ మొత్తం  3,134 కోట్లు కాగా, గత కొనేళ్లుగా వృద్ధి వేగవంతంగా ఉందని పేర్కొన్నారు. 2016-17లో కేవలం 1,004 కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్టింపు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. 

హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌

Thursday 21st November 2019

ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసింది. వైర్‌లెస్‌ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ సహకారంతో దీనిని స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న సంస్థల నూతన డిజిటల్‌ అవసరాలను తీర్చేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 5జీ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని డొమెయిన్‌ ఆధారిత పరిష్కారాలను ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తారు. ఆరోగ్యం, వాహన, తయారీ, చిల్లర వర్తకం

Most from this category