News


షేర్ల దుర్వినియోగానికి చెక్‌

Friday 14th February 2020
news_main1581651184.png-31779

  • ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించిన సెబీ

న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ సిస్టమ్‌ను రూపొందించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో స్టాక్ ఎక్స్చేంజీలను ఈ సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేస్తుందని పేర్కొంది. క్లయింట్లు తనఖాగా ఉంచిన షేర్లను కొన్ని బ్రోకింగ్ సంస్థలు.. సొంత అవసరాల కోసం లేదా ఇతర క్లయింట్ల అవసరాల కోసం దుర్వినియోగం చేసిన ఉదంతాలు వెలుగుచూసిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు తీసుకుంది. ఈ వ్యవస్థ కింద.. బ్రోకర్లు వారంవారీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించే క్లయింట్ల షేర్ల డేటా వివరాలను సెబీ ఆన్‌లైన్ సిస్టమ్ సేకరిస్తుంది. క్లయింట్ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్లు, మరుసటి రోజున బ్రోకరు చూపించిన షేర్ల పరిమాణాన్ని పోల్చి చూస్తుంది. ఏవైనా వ్యత్యాసాలు కనిపించిన పక్షంలో ఎక్స్చేంజీలను అప్రమత్తం చేస్తుంది. ప్రతీవారం ఈ నివేదికలు విడుదల చేస్తామని, ఇప్పటికే ఇలాంటి మూడు కేసులను ఎక్స్చేంజీలకు తెలియజేశామని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. 



You may be interested

ప్రారంభంలో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచురీ

Friday 14th February 2020

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాల్ని అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం జోరుగా మొదలైంది. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది క్షణాల్లోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభంతో 41,650 పాయింట్లపైకి, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 12,240 పైకి చేరిపోయింది. ట్రేడింగ్‌ను  ప్రస్తుతం భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలో ఉన్నప్పటికీ.. ధీర్ఘాకాలంలో వృద్ధి ఊపందుకుంటుందని గ్లోబల్‌ దిగ్గజ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ‍  విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి లాభంతో

బీపీసీఎల్‌ లాభం మూడు రెట్లు అప్‌

Friday 14th February 2020

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొ లిమిటెడ్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో  మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.699 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.2,051 కోట్లకు పెరిగింది. స్థూల లాభం రూ.638 కోట్ల నుంచి రూ.2,247 కోట్లకు ఎగసింది. నికర లాభం మూడు రెట్లు పెరిగినా, కార్యకలాపాల ఆదాయం మాత్రం తగ్గింది. గత

Most from this category