News


ఇన్ఫీ పద్దులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌?

Friday 24th January 2020
news_main1579848854.png-31164

కోరనున్న సెబి
ఇన్ఫోసిస్‌ ఆడిట్‌ పుస్తకాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని సెబి ఆదేశించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ పద్దు పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని గతేడాది కొందరు విజిల్‌బ్లోయర్లు సెబికి, యూఎస్‌ సెక్‌కు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై విచారణ జరుపుతున్న సెబి, కంపెనీ ఆడిట్‌పుస్తకాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు మొగ్గు చూపుతుందని తెలిసింది. త్వరలో ఈమేరకు ఇన్ఫోసిస్‌కు సెబి ఆదేశాలు జారీ చేయవచ్చని, ఆరోపణల పూర్తి స్వరూపం, నిజానిజాలు తెలుసుకునేందుకు సెబి ఈ నిర్ణయం తీసుకోవచ్చని సదరు వర్గాలు తెలిపాయి. గత నవంబర్‌లో ఆరోపణలపై విచారణ ఆరంభించినట్లు సెబి చైర్మన్‌ త్యాగి చెప్పారు. అదే సమయంతో ఇన్ఫీ నెంబర్లను భగవంతుడు కూడా తారుమారు చేయలేడన్న కంపెనీ చైర్మన్‌ నందన్‌ నీలేకని వ్యాఖ్యలపై త్యాగి వ్యంగ్యంగా స్పందించారు. మరోవైపు ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ(జాతీయ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథార్టీ) సైతం ఈ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. విజిల్‌బ్లోయర్ల ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని తాజా ఫలితాల సందర్భంగా ఇన్ఫీ వెల్లడించింది. 



You may be interested

ఇండియా బుల్స్‌ , సెంచురీ టెక్స్‌టైల్స్‌ అప్‌

Friday 24th January 2020

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 22,93,306 షేర్లను విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ అయిన క్రెడిట్‌ సూసీ బ్లాక్‌ డీల్‌ ద్వారా సొంతం చేసుకోవడంతో 12 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో షేర్‌ ధర 4.23 శాతం పెరిగి 325.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  సెంచురీ టెక్స్‌టైల్స్‌ ప్రైవేటు ప్రాతిపదికన ఎన్‌సీడీలు జారీ చేయడం ద్వారా రూ.400 కోట్లను సమీకరించాలని కంపెనీ బోర్డు నిర్ణయించడంతో  12 గంటల  సమయంలో ఎన్‌ఎస్‌ఈలో సెంచురీ టెక్స్‌టైల్స్‌ షేర్‌ ధర

రూ.40,000పైకి పసిడి

Friday 24th January 2020

 శుక్రవారం బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగి రూ.40,000 పైకి చేరింది. దేశీయ ఎంసీఎక్స్‌లో  ఉదయం 11.30 గంటలకు  10 గ్రాముల పసిడి ధర  రూ.40036.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో కరోనా వైరస్‌ ప్రభావంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పసిడి కొనుగోలుపై దృష్టి పెట్టడంతో క్రితం రోజుతో పోలిస్తే పసిడి  ధర ఐదు డాలర్లు పెరగడంతో ఔన్స్‌ బంగారం ధర 15,60.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనాలో

Most from this category