News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై రూ.10 లక్షల జరిమానా

Thursday 19th September 2019
news_main1568865005.png-28422

  • 45 రోజుల్లో చెల్లించాలి 
  • ఆదేశించిన సెబీ 

న్యూఢిల్లీ: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) కంపెనీపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ రూ.10 లక్షల జరిమానా విధించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా పెట్టుబడుల సమీకరణ, ఆస్తుల విక్రయానికి సంబంధించిన సమాచారాన్ని బీఎస్‌ఈకి వెల్లడించనందుకు సెబీ ఈ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. గత ఏడాది జూలైలో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డైరెక్టర్ల​ బోర్డ్‌ నిర్ణయం తీసుకుందని సెబీ పేర్కొంది. అంతే కాకుండా ఆస్తుల విక్రయం ద్వారా రూ.30,000 కోట్ల మేర రుణ భారాన్ని తగ్గించుకోవాలని కూడా గత ఏడాది ఆగస్టులో బోర్డ్‌ నిర్ణయం తీసుకుందని తెలిపింది. . ఈ రెండు అంశాలకు సంబంధించిన వివరాలను ఈ కంపెనీ బీఎస్‌ఈకి వెల్లడించలేదని వివరించింది. అయితే గత ఏడాది ఆగస్టులో జరిగిన బోర్డ్‌ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అదే విషయాన్ని బీఎస్‌ఈకి తెలిపామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పేర్కొంది. రైట్స్‌ ఇష్యూ, ఆస్తుల విక్రయానికి సంబంధించిన ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదని, ఇన్వెస్టర్లకు, సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. 



You may be interested

ఆర్థిక మందగమనం లేదు

Thursday 19th September 2019

పన్నులు తగ్గించేందుకు కంపెనీల ఎత్తుగడలే బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌మోదీ పాట్నా: దేశం ఆర్థిక మందగమనాన్ని ఏమీ ఎదుర్కోవడం లేదన్నారు బీహార్‌ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ మోదీ. తయారీ పడిపోతుందని చూపిస్తూ పన్నులు తగ్గించాలంటూ ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చేందుకు అనసరిస్తున్న ఎత్తుగడలుగా దీన్ని అభివర్ణించారు. తన వాదనకు మద్దతుగా బీహార్‌లో పార్లే జీ బిస్కట్ల డిమాండ్‌ పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. బిహార్‌ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను సుశీల్‌మోదీయే చూస్తున్నారు.

ఎఫ్‌డీఐ సవరణలు నోటిఫై

Thursday 19th September 2019

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లకు సంబంధించి ఇటీవలి సవరణ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. కోల్‌ మైనింగ్‌, కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ ట్రేడింగ్‌లో ఇటీవలి నిర్ణయాలను డీపీఐఐటీ నోటిఫై చేసింది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే డీపీఐఐటీ(డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌) ఎఫ్‌డీఐలకు సంబంధించిన విషయాలను చూస్తోంది. డిజిటల్‌ మీడియా రంగంలో 26 శాతం మేర ఎఫ్‌డీఐలను

Most from this category