News


సీఎండీ పోస్టు విభజన...మరో రెండేళ్లు పొడిగింపు

Tuesday 14th January 2020
news_main1578972403.png-30902

సెబీ తాజా నిర్ణయం 

న్యూఢిల్లీ: లిస్టైన కంపెనీల సీఎమ్‌డీ (చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌) పదవి విభజన గడువును మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కంపెనీల నుంచి వచ్చిన వినతులను సెబీ మన్నించింది. సెబీ నిబంధనల ప్రకారం, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా అగ్రశ్రేణి 500 లిస్టెడ్‌ కంపెనీలు సీఎమ్‌డీ పదవిని చైర్మన్‌గా, ఎమ్‌డీగా రెండుగా  విభజించాల్సి ఉంది. దీనికి గడువును ఈ ఏడాది ఏప్రిల్‌ 1గా  నిర్ణయించింది. లిస్టెడ్‌ కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా, కోటక్‌ కమిటీ సూచనల మేరకు  సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో రెండేళ్లపాటు పొడిగించాలని తాజాగా సెబీ నిర్ణయించింది. గడువు పొడిగింపునకు సంబంధించిన కారణాలను సెబీ వెల్లడించలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక మందగమన కాలంలో సీఎమ్‌డీ పదవిని రెండుగా విభజించడం ఒకింత భారంతో కూడుకున్నదని, ఈ గడువును పొడిగించాలని పలు కంపెనీలు విన్నవించడంతో సెబీ గడువును పొడిగించిందని సమాచారం. ప్రస్తుతం టాప్‌ 500 లిస్టెడ్‌ కంపెనీల్లో సగం మాత్రమే సీఎమ్‌డీ పదవిని రెండుగా విభజించాయని స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పలు కంపెనీలు ఈ రెండు పదవులను కలిపేశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, విప్రో, హీరో మోటొకార్ప్‌, తదితర కంపెనీల్లో ఈ రెండు బాధ్యతలను ఒక్క వ్యక్తే నిర్వహిస్తున్నారు. 



You may be interested

కంపెనీలకు నిరసనల సెగ..

Tuesday 14th January 2020

సీఏఏ, ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదంలో టెక్‌ సంస్థలు బ్రాండ్‌ అంబాసిడర్లు, చీఫ్‌ల వైఖరులతో సమస్యలు చిక్కుల్లో పాలసీబజార్, జోహో, యాక్సెంచర్‌ తదితర సంస్థలు న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై చెలరేగే నిరసనల్లో అప్పుడప్పుడు అనుకోని విధంగా కంపెనీలు కూడా ఇరుక్కుంటున్నాయి. దీంతో వ్యతిరేకత సెగ వాటికి కూడా గట్టిగానే తగులుతోంది. తాజాగా సీఏఏ–ఎన్‌ఆర్‌సీ అంశం, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడులు, ఆరెస్సెస్‌ కార్యక్రమాలు తదితర అంశాలపై బ్రాండ్‌ అంబాసిడర్లు, తమ సంస్థల చీఫ్‌ల వైఖరులు

నిఫ్టీ తక్షణ మద్దతు 12,298, అవరోధం 12,350

Tuesday 14th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11 పాయింట్లు ప్లస్‌ నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి(13న) ఉదయం  8.40 ప్రాంతం‍లో 11 పాయింట్ల స్వల్ప లాభంతో 12,373 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,362 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద

Most from this category