News


సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పదవీ కాలం పొడిగింపు !

Saturday 29th February 2020
news_main1582951897.png-32179

  • ఆరు నెలలు పొడిగింపు 

న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగీ పదవీకాలాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించిందని సమాచారం. సెబీకి కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పాడిగింపును ఇచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 1984 బ్యాచ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన అజయ్‌ త్యాగి 2017, మార్చి 1న సెబీ చైర్మన్‌గా నియమితులయ్యారు. కాగా సెబీ చైర్మన్‌ పదవికి 20 మందికి పైగా దరఖాస్తు చేశారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతను చక్రవర్తి, కంపెనీ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌, ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శి ప్రవీణ్‌ గార్గ్‌ తదితరులు ఈ పదవికి పోటీ పడుతున్నారు. 



You may be interested

ఆర్థికరంగంపై మరింత దృష్టి అవసరం: రాజన్‌ సూచన

Saturday 29th February 2020

న్యూఢిల్లీ: ఆర్థిక పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. అయితే దీనికి బదులు ప్రభుత్వం తన రాజకీయ, సామాజిక అజండాలపైనే మరింత దృష్టి సారిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వృద్ధి మందగమనానికి ఈ అంశమూ ఒక కారణమనీ ఆయన విశ్లేషించారు. ఫైనాన్షియల్‌ రంగం ప్రక్షాళనకు కేంద్రం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం కూడా

ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై కేంద్రం సమీక్ష

Saturday 29th February 2020

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించింది.  ఇందులో భాగంగా .. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సారథ్యంలోని ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ) 17 ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పరిస్థితి సమీక్షించింది. దాదాపు 36 అవరోధాలను గుర్తించింది. వాటిని సత్వరం పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సుమారు రూ. 32,910 కోట్లతో ఈ ప్రాజెక్టులు తలపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక

Most from this category