News


కార్వీపై సెబీ ఆంక్షలు..

Saturday 23rd November 2019
news_main1574479187.png-29797

  • కొత్త క్లయింట్లు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు

న్యూఢిల్లీ: క్లయింట్లకు సంబంధించిన రూ. 2,000 కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్‌ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్‌)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల కోసం కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా నిషేధించింది. అలాగే, క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీల ఆధారంగా కేఎస్‌బీఎల్‌ ఎలాంటి సూచనలు ఇచ్చినా.. పరిగణనలోకి తీసుకోరాదంటూ ఎన్‌ఎస్‌డీఎల్‌, సీడీఎస్‌ఎల్‌ను ఆదేశించింది. క్లయింట్‌ సెక్యూరిటీల విషయంలో కేఎస్‌బీఎల్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఎన్‌ఎస్‌ఈ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. క్లయింట్ల షేర్లు మరింతగా దుర్వినియోగం కాకుండా నియంత్రణ సంస్థ తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ 12 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ హోల్‌ టైమ్ మెంబర్ అనంత బారువా వ్యాఖ్యానించారు. క్లయింట్ల నిధులు, సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినందుకు గాను డిపాజిటరీలు, స్టాక్ ఎక్స్చేంజీలు తగు క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సెబీ సూచించింది. అభ్యంతరాలేమైనా ఉన్న పక్షంలో 21 రోజుల్లోగా తెలియజేయాలంటూ కేఎస్‌బీఎల్‌కు సమయమిచ్చింది. 



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పరిష్కార ప్రక్రియ వేగవంతం

Saturday 23rd November 2019

అడ్వైజరీ కమిటీని నియమించిన ఆర్‌బీఐ ముంబై: దివాన్ హౌసింగ్‌ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ వేగవంతం చేసింది. ఈ విషయంలో అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు, సూచనలు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ఎన్‌ఎస్ కణ్ణన్, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్‌ఎస్ వెంకటేష్

ఏజీఆర్‌పై సుప్రీంలో టెల్కోల రివ్యూ పిటిషన్‌

Saturday 23rd November 2019

న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్‌)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్‌టెల్‌ శుక్రవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏజీఆర్‌ మొత్తంపై వడ్డీ, జరిమానాను రద్దు చేయాలని ఈ పిటిషన్‌లో కోరింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌  రూ. 21,682 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడింది. స్పెక్ట్రం యూసేజీ చార్జీగా చెల్లించాల్సింది రూ.13,904 కోట్లు. కాగా వొడాఫోన్‌ ఐడియా కూడా సుప్రీంలో

Most from this category