News


టాటాలకు ఊరట

Friday 10th January 2020
news_main1578647392.png-30833

ఎన్‌సీఎల్‌ఏటీ ఆర్డర్‌పై సుప్రీం స్టే
సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పునర్నియమించాలన్న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్‌ ఆదేశాల్లో లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసే పరిధి, అధికారం తనకు లేదని ట్రిబ్యునల్‌ మర్చిపోయినట్లుందని తెలిపింది. ఈ విషయమై లోతైన విచారణ సాగిస్తామని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్‌ తీర్పునిచ్చింది. మిస్త్రీ తనను పునర్నియమించాలని కోరనప్పటికీ ట్రిబ్యునల్‌ పునర్నియామక ఆదేశాలు జారీ చేసిందని సుప్రీం ఆక్షేపించింది. ఈ విషయమై మిస్త్రీ సహా అందరికీ సుప్రీం నోటీసులు జారీ చేసింది. సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పునర్నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ఆర్డర్‌పై టాటాలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజా స్టేతో టాటాలకు ఊరట లభించినట్లయింది. ట్రిబ్యునల్‌ ఆదేశాలపై స్టే అవసరం లేదని, రెండువారాల సమయం ఇచ్చి విచారణ జరపాలని మిస్త్రీ తరఫు న్యాయవాదులు వాదనల సందర్భంగా కోర్టును కోరారు. తాము అడగని అభ్యర్ధనపై ట్రిబ్యునల్‌ ఆదేశాలిచ్చిందన్నారు. తాము కేవలం మిస్త్రీని అనైతికంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మాత్రమే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించామన్నారు. తమ క్లయింట్‌ పేర్కొనే నామినీని టాటాబోర్డులో నియమించాలని కోరారు. అటు టాటాల తరఫున ముకుల్‌ రోహిత్గీ, హరీశ్‌ సాల్వే, సీనియర్‌న్యాయవాది పరాశరన్‌ వాదించారు. 



You may be interested

పీఎస్‌బీల్లో వాటాలు తగ్గించుకుంటున్న ఎంఎఫ్‌లు

Friday 10th January 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌కు పీఎస్‌యూ బ్యాంకుల్లో ఉన్న వాటాలు అనేక సంవత్సరాల కనిష్ఠాలకు చేరాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి దీంతో పాటు యస్‌బ్యాంకులో కూడా ఎంఎఫ్‌లు గణనీయంగా వాటాలు తగ్గించుకుంటున్నాయి. పీఎస్‌బీల్లో వాటాలు తగ్గించుకుంటున్న ఫండ్స్‌ ఇదే సమయంలో స్టాఫింగ్‌ సంస్థలు, సిమెంట్‌ ఉత్పత్తి కంపెనీల్లో వాటాలు పెంచుకుంటున్నాయి. యస్‌బ్యాంకులో డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంఎఫ్‌లు తమ వాటాను 5.1 శాతానికి తగ్గించుకున్నాయి. 2013 తర్వాత బ్యాంకులో ఎంఎఫ్‌ల వాటా ఈ స్థాయికి రావడం

ఈ మిడ్‌ క్యాప్స్‌ జోరు చూడండి!

Friday 10th January 2020

కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సన్‌ టీవీ నెట్‌వర్క్స్‌ ఇమామీ పేపర్‌ మిల్స్‌ న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ అంతర్జాతీయ మార్కెట్లలో బలపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో జోరు చూపుతున్నాయి. మిడ్‌ సెషన్‌కల్లా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,311 పాయింట్లను తాకింది. తద్వారా 2019 డిసెంబర్‌ 20న సాధించిన 12,293 పాయింట్ల చరిత్రాత్మక ఇంట్రాడే గరిష్టాన్ని అధిగమించింది. తదుపరి ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేశాయి. మధ్యాహ్నం 2.10 సమయంలో సెన్సెక్స్‌ 87

Most from this category