News


టెల్కోలకు ఆఖరు అవకాశం

Wednesday 22nd January 2020
news_main1579665977.png-31089

పాక్షిక చెల్లింపులైనా చేయాలంటున్న డీఓటీ
ఏజీఆర్‌ బకాయిలపై టెల్కోల అభ్యర్ధనను వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ లోపు టెలికం శాఖతో చెల్లింపుల విధివిధానాలు, కాలపరిమితి గురించి టెల్కోలు చర్చించాల్సిఉంటుంది. గురువారానికి టెలికం కంపెనీలు టెలికం శాఖకు రూ. 1.02 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిఉంది. అయితే డెడ్‌లైన్‌ సమయానికి మొత్తం కట్టకున్నా, కొంత మొత్తం చెల్లిస్తే చర్చలకు తాము సిద్ధమని డీఓటీ అధికారులు సంకేతాలు ఇచ్చారు. కోర్టు తీర్పు వచ్చే వరకు డీఓటీ టెల్కోలను మొత్తం చెల్లింపునకై ఒత్తిడి చేయదని భావిస్తున్నట్లు సీఓఏఐ డీజీ రాజన్‌ మాథ్యూస్‌ చెప్పారు. ‘‘ మా వైపు నుంచి అంతా స్పష్టంగా ఉంది. చెల్లింపులు చేయాలన్న ఉద్దేశం ఉన్నట్లు టెల్కోలు నిరూపించుకోవాలి. ఇందుకోసం ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాలి. 23తారీకున టెల్కోలు పాక్షిక చెల్లింపులైనా చేస్తే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము’’ అని డీఓటీ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇదే జరిగితే తర్వాత చెల్లింపుల రోడ్‌ మ్యాప్‌ను ఒక్కోకంపెనీ విడిగా ఇవ్వాల్సిఉంటుందన్నారు. బకాయిల చెల్లింపు గడువు 15 సంవత్సరాలుండాలని సీఓఏఐ కోరుతోంది. 
ఏజీఆర్‌ తీర్పును రివ్యూ చేయాలన్న టెలికం కంపెనీల అభ్యర్ధనను సుప్రీంకోర్టు గతవారం కొట్టివేసింది. దీంతో కంపెనీలు ఈ అంశంపై క్యురేటివ్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ విచారించిన కోర్టు వచ్చేవారం దీనిపై వాదనలు వినాలని నిర్ణయించింది. అయితే 23 డెడ్‌లైన్‌పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అందువల్ల డీఓటీ చెల్లింపులకై అడుగుతోంది. టెలికం కంపెనీలు తొలుత కనీసం రూ.25-30 వేల కోట్లైనా చెల్లించాలని డీఓటీ కోరుతోంది. ఇటీవలే ఎయిర్‌టెల్‌ నిధులు సమీకరించినందున ఈ మొత్తం చెల్లించడం ఇబ్బంది కాదని డీఓటీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలో డీఓటీ ఆశించినంత మేర టెల్కోలు పాక్షిక చెల్లింపులు చేస్తాయా? లేదా? అన్నది కీలకంగా మారింది. డీఓటీ ఆశించినంత చెల్లించేందుకు టెలికం కంపెనీలు సుముఖంగా ఉన్నట్లు కనిపించడంలేదు. సరైన ఊరట లభించకపోతే తాము కార్యకలాపాలు మూసివేసుకుంటామని వొడాఫోన్‌ ఐడియా తన మోడిఫికేషన్‌ పిటీషన్‌లో కోర్టుకు వెల్లడించింది. ఏజీఆర్‌ లెక్కలు సంక్లిష్టమైనవని, కోర్టు ఆదేశించినట్లు 90 రోజుల్లో కొలిక్కి రావని ఎయిర్‌టెల్‌ తన పిటీషన్‌లో పేర్కొంది. మొత్తం మీద టెల్కోలన్నీ కాలపరిమితి పెంపును, బకాయి భారం తగ్గింపును కోరుకుంటున్నాయి. డీఓటీ మాత్రం ముందు కొంత పాక్షిక చెల్లింపైనా చెల్లిస్తే ఏ చర్చలకైనా సిద్ధమని చెబుతోంది. దీంతో 23న ఏంజరుగుతుందనేది కీలకంగా మారనుంది. 
ఫ్లాట్‌గా ఎయిర్‌టెల్‌, నెగిటివ్‌గా వీఐఎల్‌
కంపెనీలో 100 శాతం ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు పెద్దగా స్పందించలేదు. ఆరంభ ట్రేడింగ్‌లో దాదాపు 2 శాతం లాభంతో రూ.523ను తాకినా వెనువెంటనే వెనక్కుతగ్గి స్వల్పలాభంతో రూ. 513 వద్ద ట్రేడవుతోంది. మరో టెల్కో వొడోఫోన్‌ ఐడియా దాదాపు 5 శాతం నష్టంతో రూ.5.65 వద్ద ట్రేడవుతోంది. You may be interested

12200పైన నిఫ్టీ ప్రారంభం

Wednesday 22nd January 2020

150 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు రెండు రోజుల వరుస నష్టాల ముగింపు అనంతరం మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 143 పాయింట్ల లాభంతో 41,467.13 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల పెరిగి 12200పైన 12,203.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి లాభంతో ప్రారంభం కావడంతో పాటు

విలీనానికి 3 బీమా సంస్థల బోర్డులు ఆమోదం

Wednesday 22nd January 2020

చెన్నై: ప్రభుత్వ రంగంలోని మూడు సాధారణ బీమా సంస్థల విలీనం చర్యలు ఊపందుకున్నాయి. ఈ ప్రతిపాదనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎన్‌ఐసీ), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఓఐసీ), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (యూఐఐసీ) బోర్డులు ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఐసీ, యూఐఐసీ బోర్డులు గత శుక్రవారం ఢిల్లీలో సమావేశం కాగా... ఎన్‌ఐసీ బోర్డు సోమవారం కోల్‌కతాలో భేటీ అయ్యింది. 2018 కేంద్ర బడ్జెట్‌లో ఈ మూడు

Most from this category