News


రూ. 12 వేల కోట్ల లెక్క తప్పింది!!

Wednesday 11th December 2019
news_main1576033717.png-30160

  • ఆర్‌బీఐ ఆడిట్‌లో పెరిగిన ఎస్‌బీఐ మొండిబాకీలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సర ఫలితాల్లో దాదాపు రూ.12,000 కోట్ల మేర మొండిబాకీలు బయటపడలేదు. రిజర్వ్‌ బ్యాంకు ఆడిట్‌లో రూ.11,932 కోట్ల మేర వ్యత్యాసం (డైవర్జెన్స్‌) వచ్చినట్లు ఎస్‌బీఐ మంగళవారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో.. స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ.1,72,750 కోట్లుగా ఎస్‌బీఐ లెక్కించింది. అయితే, ఇవి మరో రూ.11,932 కోట్లు పెరిగి రూ.1,84,682 కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ మదింపు చేసింది. అలాగే, నికర ఎన్‌పీఏలు రూ.65,895 కోట్లుగా ఎస్‌బీఐ వెల్లడించగా.. ఇవి రూ. 77,827 కోట్లుగా ఉంటాయని ఆర్‌బీఐ లెక్కించింది. దీంతో మొత్తం మీద రూ.12,036 కోట్ల మేర అదనంగా ప్రొవిజనింగ్‌ చేయాల్సి వచ్చిందని, దీని ప్రకారం చూస్తే రూ.6,968 కోట్ల మేర నష్టం నమోదు చేయాల్సి వచ్చేదని స్టాక్‌ ఎక్స్చేంజీలకు ఎస్‌బీఐ తెలియజేసింది. 2018-19లో ఎస్‌బీఐ రూ.862 కోట్ల నికర లాభం ప్రకటించింది. 
ఆర్థికంగా మెరుగైన పనితీరు చూపించుకునే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకులు .. మొండిబాకీల పరిమాణాన్ని తక్కువ చేసి చూపిస్తుండటాన్ని ఆర్‌బీఐ కొన్నాళ్లుగా నిశితంగా పరిశీలిస్తోంది. లెక్కలను స్వయంగా మదింపు చేస్తోంది. రెండింటి మధ్య తేడాలేమైనా ఉంటే సత్వరం చర్యలు తీసుకుంటోంది. 



You may be interested

యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి

Wednesday 11th December 2019

సైటాక్స్‌ గ్రూప్ ఆఫర్‌కు ఓకే.. తదుపరి బోర్డ్‌సమావేశంలోనే తుది ని‍ర్ణయం ఇంకా పరిశీలనలోనే బ్రెయిచ్‌ ప్రతిపాదన ముంబై: యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడుల ప్రతిపాదనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని భావించగా, కేవలం 50 కోట్ల డాలర్లకే బ్యాంక్‌ సుముఖత వ్యక్తం చేసింది. సైటాక్స్‌ హోల్డింగ్స్‌, సైటాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ ప్రతిపాదించిన ఈ ఆఫర్‌ విషయంలో సానుకూలంగా ఉన్నామని మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం యస్‌

ఎంతో ర్యాలీ చేసినా.. ఇంకా సత్తా..!

Wednesday 11th December 2019

మన మార్కెట్లో మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌ (ఎన్నో రెట్లు పెరిగినవి) ఎన్నో ఉన్నాయి. 2001 నుంచి 2019 డిసెంబర్‌ మధ్య కాలంలో 173 స్టాక్స్‌ పది రెట్లకు పైగా వృద్ధి చెందాయి. కొన్ని స్టాక్స్‌ 2,00,000 శాతం కూడా పెరిగాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతోపాటు మరెన్నో సంక్షోభాలను ఈ మధ్య కాలంలో మార్కెట్లు అధిగమించాయి. ఇదే కాలంలో ఈ స్టాక్స్‌ తమ సత్తా చూపించాయి. అయితే, వీటిలో కొన్నింటి పట్ల

Most from this category