News


ఎస్‌బీఐ విన్నూత గృహరుణ పథకం

Thursday 9th January 2020
Markets_main1578542319.png-30785

ఎస్‌బీఐ ప్రకటన
ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’ పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్‌బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5 కోట్ల ధర ఉండే ప్రాజెక్టులపై ఈ పథకం ముందుగా అమలవుతుందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ పథకం కొనుగోలుదారులకు, బిల్డర్లకు, బ్యాంకుకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ పథకం గురించి కుమార్‌ మరింత వివరిస్తూ.. ‘‘ఉదాహరణకు ఒక కొనుగోలుదారు ఒక ప్రాజెక్టులో రూ.2 కోట్ల ఫ్లాట్‌ బుక్‌ చేసుకుని రూ.కోటి చెల్లించారనుకుంటే, ఆ ప్రాజెక్టు నిలిచిపోతే అప్పుడు రూ.కోటి తిరిగి కొనుగోలుదారుకు చెల్లిస్తాం. ఈ గ్యారంటీ సంబంధిత ప్రాజెక్టు అక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ పొందేంత వరకు అమల్లో ఉంటుంది. 



You may be interested

వ్యాపారుల కోసం పేటీఎం ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్

Thursday 9th January 2020

ముంబై: డిజిటల్ పేమెంట్స్ సేవల సంస్థ పేటీఎం తాజాగా దేశవ్యాప్తంగా వ్యాపారుల కోసం ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం వాలెట్‌, రూపే కార్డులు, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్స్ ద్వారా జరిగే చెల్లింపులు నేరుగా వ్యాపారుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. దీనికి ఎటువంటి ఫీజు ఉండదని పేర్కొన్నారు. దీనితో పాటు కస్టమర్ల లావాదేవీల వివరాలను పొందుపర్చే

చల్లబడ్డ చమురు, పసిడి ధరలు

Thursday 9th January 2020

5 శాతం పతనమైన నైమెక్స్‌ చమురు 4 శాతం నీరసించిన బ్రెంట్‌ బ్యారల్‌ 1600 డాలర్లకు దిగివచ్చిన పసిడి ఔన్స్‌ మధ్యప్రాచ్యంలో చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌ ఇకపై ప్రత్యక్ష దాడులకు దిగబోమన్న సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడింది. దీంతో ఇటీవల రివ్వుమని పైకెగసిన ముడిచమురు, బంగారం ధరలు ఉన్నట్టుండి దిగివచ్చాయి. ఇరాన్‌ మిసైళ్ల దాడుల కారణంగా ప్రాణనష్టం వాటిల్లలేదంటూ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడం‍తో ఉద్రిక్తతలు చల్లారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Most from this category