News


స్థిర రేటుపై గృహ రుణాలు

Monday 16th September 2019
news_main1568607088.png-28392

  • కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్‌ రేటు
  • తీసుకొచ్చే యోచనలో ఎస్‌బీఐ
  • ఆర్‌బీఐ నుంచి స్పష్టత కోరిన బ్యాంకు

లేహ్‌: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ స్థిర రేటుపై గృహ రుణాలను తీసుకురావాలనుకుంటోంది. ఇవి స్థిర రేటు (ఫిక్స్‌డ్‌) నుంచి అస్థిర రేటు(ఫ్లోటింగ్‌)కు మారే గృహ రుణాలు. అంటే ప్రారంభం నుంచి నిర్ణీత కాలం వరకు (సుమారు ఐదు పదేళ్లు) ఒకటే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా గృహ రుణంపై రేటు మారుతుంటుంది. ఈ విధమైన గృహ రుణాలను ఆఫర్‌ చేయవచ్చా? అన్న దానిపై ఆర్‌బీఐ నుంచి స్పష్టత కోరినట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. లేహ్‌ వచ్చిన సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల రిటైల్‌ రుణాలను ఫ్లోటింగ్‌ రేటు ఆధారంగానే అందించాలని, రుణాలపై రేట్లు రెపో వంటి ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్ల ఆధారంగానే ఉండాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించిన విషయం గమనార్హం. ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాల విడుదల అనంతరం ఫ్లోటింగ్‌ రేటు రుణాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై స్పష్టత లేదన్నారు రజనీష్‌ కుమార్‌. 
కస్టమర్లు కోరుకుంటున్నారు...
కొంత మంది కస్టమర్లు గృహ రుణాలపై రేట్లు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అటువంటి వారి కోసం ఫిక్స్‌డ్‌-ఫ్లోటింగ్‌ రేటు ఉత్పత్తులను అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. వీటిల్లో ఐదు లేదా పదేళ్ల వరకు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందన్నారు. కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్‌ రేటుకు మార్చడం... భవిష్యత్తు పరిస్థితులను బ్యాంకు అంచనా వేయలేకపోవడం వల్లనేనన్నారు. సాధారణంగా గృహ రుణాల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తుల నిర్వహణ బాధ్యతల విషయంలో 30 ఏళ్ల కాలానికి స్థిర రేటు ఉత్పత్తిని ఆఫర్‌ చేయడం కష్టమని వివరించారు. ఎస్‌బీఐ గరిష్టంగా 30 ఏళ్ల కాలానికే గృహ రుణాలను అందిస్తోంది. ప్రస్తుతానికి ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత ఫ్లోటింగ్‌ రేటు గృహ రుణాలను ఆఫర్‌ చేస్తోంది. రెపో రేటు ఆధారిత ఫ్లోటింగ్‌ రుణాలపై రేట్లు తరచుగా మారే పరిస్థితులు ఉంటుంటాయి. ఆర్‌బీఐ రేపో రేటును సవరించినప్పుడల్లా బ్యాంకులు కూడా ఆ మేరకు మార్పులు చేయాల్సి వస్తుంది. You may be interested

నికో వాటా రిలయన్స్‌, బీపీల చేతికి

Monday 16th September 2019

10 శాతం నికో వాటా.. రిలయన్స్‌, బీపీల పరం  ప్రభుత్వం ఆమోదం !  న్యూఢిల్లీ: కేజీ-డి6 చమురు క్షేత్రంలో కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌కు ఉన్న 10 శాతం వాటాను ఇతర భాగస్వాములు టేకోవర్‌ చేశారని సమాచారం. ఈ చమురు క్షేత్రానికి సంబంధించి అభివృద్ధి వ్యయాల్లో తన వాటాను చెల్లించడంలో నికో రిసోర్సెస్‌ విఫలమైంది. దీంతో ఇతర భాగస్వాములు-రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇంగ్లాండ్‌కు చెందిన బీపీ పీఎల్‌సీలు నికో రిసోర్సెస్‌ వాటాను టేకోవర్‌ చేశాయని

ప్రభుత్వ చర్యలు నిరాశపరిచాయి: క్రెడాయ్‌

Monday 16th September 2019

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కేంద్రం ప్రకటించిన చర్యలు నిరాశపరిచినట్టు ఆ రంగానికి చెందిన అత్యున్నత సంఘం క్రెడాయ్‌ అభిప్రాయపడింది. పన్ను రాయితీలు, గృహ కొనుగోలుదారులకు, గృహ నిర్మాణదారులకు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వాలనే డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. నిలిచిపోయిన ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రకటించిన నిధి ప్రభావం పరిమితమేనని, ఎందుకంటే దివాలా చర్యలు ఎదుర్కొంటున్నవి, ఎన్‌పీఏలుగా మారిన ప్రాజెక్టులను ఈ ప్యాకేజీ నుంచి మినహాయించడమేనని గుర్తు

Most from this category