ఫ్లోటింగ్ రేట్ రుణాలకు రెపోనే ప్రాతిపదిక
By Sakshi

ముంబై: తమ చర వడ్డీ (ప్లోటింగ్) రుణాలు అన్నింటికీ రెపో రేటే ప్రామాణికంగా ఉంటుందని ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.4 శాతంగా ఉంది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా... ప్రస్తుత పరిస్థితిపై నిరుత్సాహం...
బ్యాంకింగ్ రుణ రేట్లు అన్నీ రెపోసహా ద్రవ్య విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు అనుసంధానం కావాల్సిందేనని బ్యాంకులకు ఈ నెల 4వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలకు ఒకసారి ఇందుకు సంబంధించి సమీక్షలు, అనుసంధాన నిర్ణయాలు (రిసెట్) జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. వ్యక్తిగత లేదా గృహ, ఆటో అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ఇచ్చే కొత్త ఫ్లోటింగ్ (చర వడ్డీరేటు) రేట్లు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచీ తప్పనిసరిగా రెపో సహా ద్రవ్య, పరపతి విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల ఆర్బీఐ రెపో తగ్గిస్తే, ఆ ప్రయోజనం త్వరితగతిన కస్టమర్‌కు అందుబాటులోనికి రావడానికి వీలు కలుగుతుంది. బ్యాంకులు తమకు లభించిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిండచం లేదని, ఆర్థిక మందగమనానికి ఇది ఒక కారణమనీ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం నిధుల సమీకరణ-వ్యయ మిగులు ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) విధానాన్ని బ్యాంకులు అనుసరిస్తున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఆర్బీఐ విధానపరమైన రేటు నిర్ణయ బదలాయింపు ప్రక్రియ ఎంసీఎల్ఆర్ మార్గంలో ఆలస్యం అవుతోంది. రెపో గడచిన నాలుగు ద్వైమాసికాల్లో 1.1 శాతం తగ్గింది. అయితే ఆగస్టు వరకూ రెపో 0.75 బేసిస్ పాయింట్లు తగ్గితే, (అటు తర్వాత 35 బేసిస్ పాయింట్లు) బ్యాంకులు మాత్రం 0.30 శాతం మాత్రమే ఈ రేటును కస్టమర్లకు బదలాయించాయని ఆర్బీఐ స్వయంగా పేర్కొంది.
You may be interested
ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు
Tuesday 24th September 2019కార్పొరేట్ పన్ను కోతపై జెఫరీస్ నివేదిక ప్రభావం పరిమితమేనని అభిప్రాయం ముంబై: కార్పొరేట్ పన్నును కేంద్ర ప్రభుత్వం ఒకేసారి గణనీయంగా తగ్గించినప్పటికీ... భారీగా పడిపోయిన ఆటోమొబైల్ వాహన డిమాండ్ పునరుద్ధరణపై పరిమిత ప్రభావమే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ అభిప్రాయపడింది. కంపెనీలపై 10-12 శాతం పన్నును తగ్గించడం వల్ల అంతిమంగా 1-2 శాతం వరకే ఉత్పత్తులపై తగ్గింపునకు అవకాశం ఉంటుందని ఈ సంస్ధ తన నివేదికలో పేర్కొంది. దీనికి బదులు ప్రభుత్వం జీఎస్టీ
పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం అక్కర్లేదు
Tuesday 24th September 2019ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు సహజంగానే పెరుగుతున్నాయి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. ఎలక్ట్రిక్ వాహన (ఈవీ)విక్రయాలు సమజంగానే ఊపందుకుంటున్నాయని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్ రూపంలోనే ఉంటాయన్నారు. 2030 తర్వాత దేశంలో ఈవీ విక్రయాలనే అనుమతించాలన్నది నీతి ఆయోగ్ సిఫారసు. 150సీసీలోపు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను 2025 తర్వాత ఈవీ రూపంలో