STOCKS

News


ఓటీపీతోనే ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నగదు

Saturday 28th December 2019
news_main1577504341.png-30485

  • జనవరి 1 నుంచి అమల్లోకి
  • రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు
  • లావాదేవీలకు మరింత భద్రత


న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఏటీఎంకు చీకటి పడిన తర్వాత వెళుతున్నారా..? కార్డుతోపాటు, చేతిలో మొబైల్‌ ఫోన్‌ కూడా ఉండాలి. ఎందుకంటే ఓటీపీ సాయంతోనే నగదు ఉపసంహరణ జరిగే విధానాన్ని ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా తన ఏటీఎంలలో ప్రవేశపెడుతోంది. రూ.10,000, అంతకుమించి నగదు ఉపసంహరణలకు మాత్రమే ఇది అమలవుతుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే. మిగతా వేళల్లో ఇప్పటి మాదిరే ఓటీపీ లేకుండా నగదును తీసుకోవచ్చు. అలాగే, రూ.10వేల లోపు నగదును ఇక ముందూ ఓటీపీ లేకుండా రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. జనవరి 1 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తోంది. నూతన విధానంలోనూ నగదు ఉపసంహరణ ప్రక్రియలో పెద్దగా మార్పు ఉండదు. అదనంగా ఓటీపీ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 
ఓటీపీ విధానం ఇలా...

  • కార్డును ఏటీఎం మెషిన్‌లో ఉంచి చివర్లో నగదు మొత్తాన్ని టైప్‌ చేసి ఓకే చేసిన తర్వాత ఖాతాదారుల రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్‌పై ఓటీపీ అడుగుతుంది. నంబర్‌ను ప్రవేశపెట్టడం ద్వారానే నగదు ఉపసంహరణకు వీలవుతుంది.
  • రూ.10,000, అంతకుమించిన నగదు ఉపసంహరణలకే ఓటీపీ విధానాన్ని ఎస్‌బీఐ పరిమితం చేసింది. 
  • రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల్లోపు చేసే లావాదేవీలకే ఓటీపి అమల్లో ఉంటుంది. మిగిలిన వేళల్లో ఉపసంహరణలకు ఓటీపీ అవసరం ఉండదు.
  • ఎస్‌బీఐ ఏటీఎంలలోనే ఈ విధానం. ఎస్‌బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు ఓటీపీ విధానం ఉండదు. భవిష్యత్తులో అన్ని బ్యాంకులు ఈ విధానంలోకి మళ్లితే అప్పుడు అన్ని చోట్లా ఓటీపీ అవసరపడుతుంది. 
  • ఖాతాదారులు తమ కార్డును పోగొట్టుకున్నా లేదా కార్డు వివరాలను మరొకరు తెలుసుకుని అనధికారికంగా, మోసపూరిత లావాదేవీలు చేద్దామనుకుంటే కుదరదు. ఎందుకంటే కచ్చితంగా ఓటీపీ ఉంటేనే పని జరుగుతుంది. దీంతో ఎస్‌బీఐ ఏటీఎం లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి.

 



You may be interested

ఐటీ కంపెనీలకు ‘బోయింగ్‌’ షాక్‌!

Saturday 28th December 2019

బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం 737 మ్యాక్స్‌ విమాన తయారీని నిలిపివేయడం వల్లే న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలకు బోయింగ్‌ సంస్థ నుంచి వచ్చే వ్యాపారానికి గండి పడనుంది! ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ నుంచి బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. బోయింగ్‌ తన ప్రతిష్టాత్మక 737 మ్యాక్స్‌ సిరీస్‌ విమానాల తయారీని జనవరి నుంచి నిలిపివేయనుంది. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, సైయంట్‌, ఎల్‌అండ్‌టీ

పూర్తిగా జూపల్లి చేతికి ‘మై హోమ్‌’

Saturday 28th December 2019

సీఆర్‌హెచ్‌ నుంచి 50 శాతం వాటా కొనుగోలు రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించిన గ్రూప్‌ సంస్థలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటిదాకా ఐర్లాండ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్‌ మెటీరియల్‌ కంపెనీ సీఆర్‌మెచ్‌ ఇండియాతో కలిసి 50:50 భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్‌ ఇండస్ట్రీస్‌’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్‌ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌,

Most from this category